Nitish Kumar: దేశ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?
ABN, Publish Date - Jun 08 , 2024 | 03:46 PM
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్(272)ని దాటి 293 స్థానాలు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా..
లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్(272)ని దాటి 293 స్థానాలు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తమూ ఖరారైంది. ఇలాంటి తరుణంలో.. దేశ రాజకీయాలను కుదుపు కుదిపేసేలా ఓ రాజకీయ నేత సంచలన ప్రకటన చేశారు. బిహార్ సీఎం, జనతాదళ్ (యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు (Nitish Kumar) ప్రధాని పదవి ఆఫర్ చేశారంటూ కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీకి చెందిన కేసీ త్యాగి (KC Tyagi) ఓ ఇంటర్వ్యూలో ఈ బాంబ్ పేల్చారు.
నితీశ్ కుమార్‌కు ప్రధాని ఆఫర్
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీ త్యాగి మాట్లాడుతూ.. ‘‘నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది. నితీశ్‌ను ఈ కూటమికి కన్వీనర్ అయ్యేందుకు ఎవరైతే అనుమతించలేదో.. ఆ వ్యక్తుల నుంచే ఈ ఆఫర్ ఆయనకు వచ్చింది. కానీ తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని చెప్పి, ఆ ఆఫర్‌ని నితీశ్ తిరస్కరించారు’’ అని చెప్పుకొచ్చారు. మరి, ఈ ఆఫర్ చేసిన నాయకులు ఎవరని ప్రశ్నించగా.. అందుకు జవాబు ఇచ్చేందుకు త్యాగి నిరాకరించారు. ప్రధాని పదవి ఆఫర్‌తో కొందరు నాయకులు నేరుగా నితీశ్‌ని సంప్రదించాలని అనుకున్నారని చెప్పారు కానీ, వారి పేర్లు బయటపెట్టలేదు. తాము ఇండియా కూటమిని విడిచిపెట్టి ఎన్డీఏలో చేరామని, ఇకపై వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ క్లారిటీ
అయితే.. కేసీ త్యాగి వాదనల్ని మాత్రం కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని, నితీశ్‌కు ఎవరూ పీఎం పదవిని ఆఫర్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడుతూ.. ‘‘కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. అలాంటి సమాచారం మాకు అందలేదు. నాకు తెలిసి.. కేసీ త్యాగి ఒక్కరికే ఈ విషయం తెలిసి ఉంటుంది’’ అంటూ సైలెంట్‌గా కౌంటర్ వేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక తాము నితీశ్‌కుమార్‌ని సంప్రదించలేదని, ఇదొక అసత్య ప్రచారమని ఆయన ఖరాఖండీగా తేల్చి చెప్పారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 08 , 2024 | 06:57 PM