ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sharad Pawar: సీఎం కుర్చీ కోసం పేచీల్లేవు

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:58 PM

ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' మెజారిటీ సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఎన్‌సీపీ-ఎస్‌పీ సుప్రీం శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎవరనేది ఆ తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు.

కొల్హాపూర్: ముఖ్యమంత్రి పదవి కోసం 'మహా వికాస్ అఘాడి' (MVA) కూటమిలో ఎలాంటి పేచీలు లేవని కూటమి భాగస్వామ పార్టీ అయిన ఎన్‌సీపీ-ఎస్‌సీపీ (NCP-SCP) సుప్రీం శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికలు పూర్తయిన తర్వాతే సీఎం ఎవరనే అంశంపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. కొల్హాపూర్‌లో బుధవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' మెజారిటీ సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనూ సీఎం ఎవరనేది ప్రకటించ కుండా ఎన్నికలకు కూటమి వెళ్లిందని చెప్పారు.


సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని పవార్ చెప్పారు. ''ఉదాహరణకు 1977లో ఎమర్జెన్సీ తర్వాత వెంటనే ఎన్నికలు జరిగాయి. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. జయప్రకాష్ నారాయణ్ పేరు ముందు వరుసలో ఉంది. ఎన్నికలు పూర్తయి ప్రధానమంత్రిని ఎన్నికోవాల్సి వచ్చినప్పుడు మొరార్జీ దేశాయ్‌ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ ప్రకారమే ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థి పేరు ప్రకటించాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. ఎన్నికల తర్వాత పబ్లిక్ మెజారిటీకి అనుగుణంగా తామంతా కలిసి చర్చించుకుని సీఎం ఎంపిక జరుపుతామని చెప్పారు.

Nitin Gadkari: అలా చేస్తే శివాజీ విగ్రహం కూలేది కాదు... నితిన్ గడ్కరి ఆసక్తికర వ్యాఖ్యలు


శివాజీ విగ్రహం కూలిపోవడంపై..

రాజ్‌కోర్డ్ ఫోర్ట్‌లోని 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహం కూలిపోవడంపై మాట్లాడుతూ, విగ్రహ శిల్పి జయదీప్ ఆప్టేకు పెద్దగా అనుభవం లేదన్నారు. బలమైన గాలుల వల్లే విగ్రహం కూలిపోయిందనే వాదన సరికాదని చెప్పారు. బలమైన గాలులు వీచినప్పటికీ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహం చెక్కుచెదర రేదని, శివాజీ పార్క్ (దాదర్) వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి ఏమీ కాలేదని చెప్పారు. పెద్దగా అనుభవం లేని వ్యక్తికి శివాజీ విగ్రహం వంటి కీలక పనులు అప్పగించడం తప్పని అన్నారు.


Read More National News and Latest Telugu New

Updated Date - Sep 04 , 2024 | 06:01 PM

Advertising
Advertising