ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

ABN, Publish Date - Oct 31 , 2024 | 08:01 PM

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఓటరు... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. పార్టీ మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసింది.

బెంగళూరు, అక్టోబర్ 31: కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయనున్నారంటూ ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అలాంటి వేళ.. ఈ ప్రచారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం బెంగళూరులో స్పందించారు. మహిళలు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేస్తున్నామంటూ జరుగుతున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మ వద్దంటూ ప్రజలకు ఆయన సూచించారు. ఈ ఉచిత బస్సు పథకంలో ఎలాంటి మార్పు లేదని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ పథకంపై పునః సమీక్ష చేసే ఆలోచన సైతం తమ ప్రభుత్వానికి లేదని సీఎం సిద్ధరామయ్య కుండ బద్దలు కొట్టారు.

Also Read: Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ టైంలో కొనుగోలు చేయాలా? వద్దా?


డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏమన్నారంటే..

కర్ణాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు టికెట్ కొని ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని సమీక్షిస్తామని ఆయన తెలిపారు. అక్టోబర్ 30వ తేదీన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐరావత్ క్లబ్ క్లాస్ 2.0 బస్సులను డిప్యూటీ సీఎం డీకే ప్రారంభించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం డీకే మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఈ మెయిళ్ల ద్వారా అత్యధిక శాతం మంది మహిళలు టికెట్ కొనుగోలు చేసి.. బస్సుల్లో ప్రయాణిస్తామని తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Diwali 2024: నరకాసురుడు ఎవరు ? దీపావళి రోజు అతని దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తారంటే..?


డీకే వ్యాఖ్యలతో జోరందుకున్న ప్రచారం..

డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎత్తి వేస్తున్నారంటూ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఓ ప్రచారం అయితే వైరలవుతుంది. అలాంటి వేళ.. సీఎం సిద్దరామయ్య పైవిధంగా స్పందించారు.

Also Read: ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?


కొన్ని గంటలకే సీఎం స్పందన.. పొంతన లేని వ్యాఖ్యలు..

అయితే ఈ పథకంపై సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోకే.. సీఎం సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు ఏ మాత్రం పొంతన లేదని ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరలవుతుంది.

Also Read: CM Chandrababu: సరిగ్గా ఏడాది.. అంతలో ఎంత తేడా?


కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించిన ఉచిత బస్సు ప్రయాణం..

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఓటరు... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. పార్టీ మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసింది.

Also Read: కొత్తిమీర తింటే.. ఇన్ని ప్రయోజనాలున్నాయా?


తెలంగాణలో సైతం ...

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇదే వాగ్దానాన్ని ప్రకటించింది. తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో సైతం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తుంది. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కారణంగా ఏటా వందల కోట్ల రూపాయిల నష్టం రోడ్డు రవాణా సంస్థకు వాటిల్లుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: viral video: దీపావళి పండగ వేళ మామ్మా మజాకా

For National News And Telugu News

Updated Date - Oct 31 , 2024 | 08:01 PM