Uddhav Thackeray: ఆ ద్రోహులకు మా పార్టీలో చేటు లేదు: ఉద్ధవ్ థాకరే
ABN, Publish Date - Oct 05 , 2024 | 09:32 PM
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత షిండేకు మద్దతుగా నిలిచిన నాయకులంతా నిరుద్యోగులు కావడం ఖాయమని శనివారంనాడు శివసేన యూబీటీ పార్టీ నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ చెప్పారు.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన రెబల్ ఫ్యాక్షన్‌పై శివసేన (UBT) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) శనివారంనాడు నిప్పులు చెరిగారు. అధికార పక్ష నేతలు త్వరలో నిరుద్యోగాలుగా మారనున్నారని, ఆ ద్రోహులకు మాత్రం తమ పార్టీలో ఎంత మాత్రం ప్రవేశం ఉండదని అన్నారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల తర్వాత షిండేకు మద్దతిచ్చిన నాయకులంతా నిరుద్యోగులు కావడం ఖాయమని శనివారంనాడు శివసేన యూబీటీ పార్టీ నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ చెప్పారు. ''ఏడాదిన్నర తర్వాత ఆ ద్రోహులు (పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు) ఉద్యోగాల్లేక మా వద్దకు ఉద్యోగం ఇమ్మని వస్తారు. ఏ ఒక్క ద్రోహికి మా పార్టీలో చోటివ్వను'' అని థాకరే స్పష్టం చేశారు.
Jammu and Kashmir Exit Polls: జమ్మూకశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎవరేమి చెప్పారంటే?
మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని 2022లో కూల్చివేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించ లేదని కూడా థాకరే విమర్శించారు. 2022లో మహావికాస్ అఘాడి ప్రభుత్వంలో శివసేన పెద్దపార్టీగా ఉంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా 39 మంది ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో శివసేన రెండుగా చీలిపోయింది. ఇది ఉద్ధవ్ రాజీనామాకు దారితీసింది. బీజేపీతో కలిసి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం షిండే సారథ్యంలోని శివసేనను నిజమైన శివసేనగా స్పీకర్, బీజేపీ నేత నార్వేకర్ ప్రకటించారు.
Also Read:
కంటెంట్‌లో కల్తీ.. కేరాఫ్ సాక్షి..
హైడ్రా ఇక తగ్గేదే లే.. మరిన్ని పవర్స్..
ఎప్పుడూ నవ్వించే అతన్ని ఎలా ఓదార్చాలి..
For More National News and Telugu News..
Updated Date - Oct 05 , 2024 | 09:32 PM