ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Muhammad Yunus: కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వం

ABN, Publish Date - Aug 09 , 2024 | 04:38 AM

విద్యార్థుల కోటా ఉద్యమంతో కల్లోలంగా మారిన బంగ్లాదేశ్‌లో నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది.

  • బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా యూనస్‌ ప్రమాణం.. సభ్యులుగా 16 మంది నియామకం

  • అభినందించిన భారత ప్రధాని మోదీ

  • హిందువులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి

  • హింసను వీడాలి.. శాంతిని నెలకొల్పాలి

  • దేశ ప్రజలనుద్దేశించి మహమ్మద్‌ యూనస్‌ వ్యాఖ్యలు

ఢాకా/న్యూఢిల్లీ, ఆగస్టు 8: విద్యార్థుల కోటా ఉద్యమంతో కల్లోలంగా మారిన బంగ్లాదేశ్‌లో నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్షుడి అధికారిక నివాసం బంగభవన్‌ దర్బార్‌హాల్‌లో గురువారం సాయంత్రం 8.30కు జరిగిన కార్యక్రమంలో యూన్‌సతోపాటు.. మరో 16 మందికి గాను.. 13 మంది తాత్కాలిక ప్రభుత్వ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాత్కాలిక ప్రభుత్వంలో విద్యార్థి సంఘాల సమన్వయకర్త నహీద్‌ ఇస్లాం, మరో నాయకుడు ఆసిఫ్‌ మహమూద్‌కు చోటు దక్కింది. అధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.


యూనస్‌ ప్రభుత్వ ప్రధాన సలహాదారు(ప్రధానికి ఉండే అధికారాలతో)గా ప్రమాణం చేశారు. మరో ముగ్గురు సభ్యులు రాయ్‌, చక్మా, బీర్‌ ప్రతీక్‌ ఫారూఖ్‌-ఎ-ఆజమ్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. ఈ కార్యక్రమంలో 400 మంది దాకా అతిథులు పాల్గొన్నారు. వీరిలో ఆర్మీ చీఫ్‌ వకార్‌-ఉజ్‌-జమా, రాజకీయ పార్టీల నాయకులు, త్రివిధ దళాధిపతులు, దౌత్యవేత్తలు ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా యూన్‌సకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలని కోరారు.


  • ప్రజలు సామరస్యంతో మెలగాలి: యూనస్‌

దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ తొలి కర్తవ్యమని మహమ్మద్‌ యూన స్‌ అన్నారు. ‘‘ప్రజలు దేశంలో ఎక్కడా ఎవరిపైనా దాడులు జరగకుండా చూసుకోవాలి. బంగ్లాదేశ్‌ పునర్నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలి’’ అని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు. దేశంలో హింస ప్రజ్వరిల్లుతోందని, ఇది మంచిది కాదంటూ.. భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు శాంతిని పాటించాలని ఆయన దేశ ప్రజలను కోరారు. మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, అహ్మదీయులపై జరుగుతున్న దాడులను ఖండించారు.


‘‘ఈ దాడులు కుట్రలో భాగమే. ప్రజలు హింస జోలికి వెళ్లొద్దు. మన దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మన సోదరుడే. నాపై విశ్వాసం ఉంచండి. ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది. ఒకవేళ మీరు నా మాట వినకపోతే.. నేను ఇక్కడ(ప్రభుత్వంలో) ఉండి కూడా వృథానే. ఇక్కడ నా అవసరం లేదనుకుంటే.. నాకు వీడ్కోలు పలికితే.. నా పని నేను చూసుకుంటాను’’ అని ఉద్వేగంగా అన్నారు. దేశ ప్రగతికి హింస, గందరగోళ పరిస్థితులే అతిపెద్ద శత్రువులని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు బంగ్లాదేశ్‌ కొత్త విజయదినోత్సవం. ఈ రోజు మనం మొదలు పెట్టిన నవ బంగ్లాదేశ్‌ నిర్మాణ ప్రయాణానికి శత్రువులైన వాటిని వీడి.. దేశంకోసం పనిచేద్దాం. విద్యార్థులు హింసను వీడి చదువుపై దృష్టి సారించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.


  • అవామీ లీగ్‌పై నిషేధం విధించాలి: బీఎన్‌పీ

హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) చైర్‌పర్సన్‌ ఖలీదా జియా సలహాదారు రుహుల్‌ కుద్దూస్‌ తాలూక్దార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం నాటోర్‌ నగరంలోని కనాయిఖలీ చత్తర్‌లో జరిగిన బీఎన్‌పీ బహిరంగ సభలో ఆయన ఈ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టారు. కాగా, బంగ్లాదేశ్‌ పరిణామాలపై హసీనా కుమార్తె సైమా వజీద్‌ పుతుల్‌ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంటూ.. ప్ర పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమె.. బంగ్లాదేశ్‌ పరిస్థితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘క్లిష్ట సమయంలో అమ్మ ఈ దేశం(భారత్‌)లోనే ఉన్నా.. ఆమెను కౌగిలించుకోలేని పరిస్థితి’’ అంటూ ఆమె ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో అనిశ్చితికి జరిగిన కుట్రకు పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ ఆజ్యం పోసిందని హసీనా కుమారుడు సాజిబ్‌ వాజెద్‌ జాయ్‌ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగాక.. తన తల్లి తిరిగి దేశానికి వస్తారన్నారు. గురువారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన తల్లికి రక్షణగా నిలిచిన భారత్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవామీ లీగ్‌ పార్టీ భారత్‌తో సదా స్నేహపూర్వకంగా ఉంటుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు భారత్‌ ఒత్తిడి తీసుకురావాలని కోరారు.


  • బ్రిటన్‌ విదేశాంగ మంత్రికి జైశంకర్‌ ఫోన్‌

బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ లామీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఫోన్‌లో మాట్లాడారని అధికారులు తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వివరాలను వెల్లడించారు. ఇరువురూ ఫోన్‌లో బంగ్లాదేశ్‌ అంశంపై చర్చించారని పేర్కొన్నారు. అయితే.. హసీనా రాజకీయ ఆశ్రయంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణ జరగాలని భారత్‌ కోరుకుంటోందని జైస్వాల్‌ వివరించారు. కాగా.. బంగ్లాదేశ్‌లో భారత వీసా జారీ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - Aug 09 , 2024 | 04:38 AM

Advertising
Advertising
<