Manmohan Singh: దేశం బాగుందా? కశ్మీర్ ఎలా ఉంది?.. దటీజ్ మన్మోహన్
ABN, Publish Date - Dec 27 , 2024 | 04:37 PM
మన్మోహన్ సింగ్ గొప్ప మనిషి, నిరాడంబరుడు, దేశ భక్తుడని డాక్టర్ పాండా చెబుతూ, తన పేషెంట్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మన్మోహన్ ఎప్పటికీ గుర్తిండిపోతారని అన్నారు.
న్యూఢిల్లీ: నాయకులు ఎలా ఉండాలనే దానికి దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఆదర్శంగా నిలుస్తారు. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన నాయకుడి లక్షణం. ఆ తరువాతే వ్యక్తిగతం. 2009లో మన్మోహన్ సింగ్‌కు హృదయ సంబంధిత శస్త్రచికిత్స న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో జరిగింది. ఆయనకు సర్జరీ చేసిన సీనియర్ కార్డియాక్ సర్జన్ రమాకాంత్ పాండా (Ramakant panda) ఆనాటి సంఘటన గుర్తుచేసుకుంటూ దేశం పట్ల మన్మోహన్ సింగ్‌కు ఉన్న నిబద్థతను వెల్లడించారు.
Manmohan Maruti 800: మన్మోహన్ సింప్లిసిటీ.. 'మారుతి 800'తో అనుబంధం
''మన్మోహన్ సింగ్‌కు 2009లో క్రిటికల్ కరోనరీ బైపాస్ సర్జరీ చేశాం. 10 నుంచి 11 గంటల సేపు సర్జరీ జరిగింది. కాస్త కోలుకోవడంతో శ్వాస తీసుకునేందుకు అమర్చిన పైప్‌ను తొలగించాం. ఆ వెంటనే ఆయన నన్ను అడిగిన మొదటి ప్రశ్న... నా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉంది? అని. మీ సర్జరీ గురించి ఏమి అడగారా అని నేను ప్రశ్నించాను. మీ వృత్తి నిబద్ధత నాకు తెలుసు. సర్జరీ గురించి నాకు బాధ లేదు. నా దేశం గురించే నా ఆలోచన'' అని మన్మోహన్ తనతో అన్నారని డాక్టర్ పాండా తెలిపారు.
మన్మోహన్ సింగ్ గొప్ప మనిషి, నిరాడంబరుడు, దేశ భక్తుడని డాక్టర్ పాండా చెబుతూ, తన పేషెంట్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మన్మోహన్ ఎప్పటికీ గుర్తిండిపోతారని అన్నారు. ఇలాంటి సర్జరీల తర్వాత సహజంగా ఏ పేషంట్లయినా ఛాతీనొప్పి అంటూ కంప్లయింట్ చేస్తుంటారని, కానీ మన్మోహన్ సింగ్ ఎన్నడూ తన ఆరోగ్యం గురించి కానీ, ఎలాంటి కంప్లయింట్స్ కానీ తమ ముందుకు తీసుసురాలేదని, ఆయన గుండెనిబ్బరం మెచ్చుకోవాలని అన్నారు. సర్జరీ అనంతర చెకప్‌లకు ఆయన ఎప్పుడు వచ్చినా ఆసుపత్రి గేటు వద్ద ఆయనను రిసీవ్ చేసుకునే వాళ్లమని తెలిపారు. వ్యక్తిగతంగా చెప్పాలంటే మన్మోహన్ ఏదైనా ఒక పని చేస్తానని చెబితే అది చేసితీరుతారని, ఆయన నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు.
ఇవి కూడా చదవండి...
Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో
Bangalore: ఎమ్మెల్యేపై దాడితో.. ఎమ్మెల్సీ సీటీ రవికి భద్రత పెంపు
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 27 , 2024 | 04:38 PM