ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అత్యాచారం చేయబోయిన డాక్టర్‌పై నర్సు సర్జికల్‌ స్ట్రైక్‌

ABN, Publish Date - Sep 14 , 2024 | 03:11 AM

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది.

  • సర్జికల్‌ బ్లేడుతో మర్మాంగం కోసివేత

  • బిహార్‌లోని గంగాపూర్‌లో ఘటన

పట్నా, సెప్టెంబరు 13: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. ఓ వైద్యుడు తన ఇద్దరు సహచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడగా.. నర్సు వైద్యుడి మర్మాంగాన్ని సర్జికల్‌ బ్లేడ్‌తో కోసేసి తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు సమాచారమివ్వగా.. వారు వెంటనే అక్కడికి చేరుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లా గంగాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఆస్పత్రిలో ఏడాదిగా నర్సు పని చేస్తోంది. బుధవారం రాత్రి ఆమె విధులు ముగించుకొని ఇంటికెళ్తుండగా.. ఆస్పత్రి నిర్వాహకుడైన డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సంజు, తన సహచరులు సునీల్‌ కుమార్‌ గుప్తా, అవధేశ్‌ కుమార్‌లతో కలసి అడ్డుపడ్డాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించిన వారు నర్సును వేధించసాగారు. ఈనేపథ్యంలోనే సంజయ్‌ ఆమెను పక్కకు లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె.. చేతికి దొరికిన సర్జికల్‌ బ్లేడుతో అతడి మర్మాంగంపై దాడి చేసింది.


వెంటనే అక్కడి నుంచి పరిగెత్తగా.. సునీల్‌, అవధేశ్‌ ఆమెను వెంబండించారు. ఈ నేపథ్యంలోనే ఓ చోట దాక్కొని ఎమర్జెన్సీ నంబర్‌ 112కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గాయపడిన వైద్యుడికి ఓ ఆస్పత్రిలో గోప్యంగా చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సర్జికల్‌ బ్లేడ్‌, రక్తంతో తడిసిన బెడ్‌ షీట్లతో పాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యాచార యత్నానికి ముందే ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను నిందితులు ఆఫ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.


Also Read:

పవన్‌ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే

విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు

పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న ఖైరతాబాద్‌..

For More National News and Telugu News..

Updated Date - Sep 14 , 2024 | 12:52 PM

Advertising
Advertising