Haryana: హర్యానాలో కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకార తేదీలో ట్విస్ట్
ABN, Publish Date - Oct 12 , 2024 | 01:07 PM
హర్యానాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం నాయబ్ సైనీ ఢిల్లీలో బీజేపీ హైకమాండ్‌తో సమావేశం నిర్వహిస్తుండగా.. పంచకులలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానాలో ప్రమాణ స్వీకార తేదీని మార్పు చేశారు.
హర్యానా(Haryana)లో సైనీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం మూడోసారి వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబరు 17న కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావిస్తున్నారు. ముందుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అక్టోబర్ 12న జరగాల్సి ఉండగా, ఆ తర్వాత తేదీని అక్టోబర్ 15కి మార్చారు. ఇప్పుడు అక్టోబరు 17న వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
కానీ ఈ ఆలస్యానికి కారణం మాత్రం ఏదీ వెల్లడించలేదు. కేబినెట్‌లో ఎవరిని తీసుకుంటారు, కుల సమీకరణలు ఎలా సాల్వ్ చేస్తారనే దానిపై బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. హోంమంత్రి అమిత్ షాతో నాయబ్ సింగ్ సైనీ కీలక భేటీ అయినట్లు సమాచారం. ఇందులోనూ పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇప్పుడు అదే కారణంతో మళ్లీ ప్రమాణ స్వీకారం వాయిదా పడిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
అగ్రనేతలతో
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓడించి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన బీజేపీ ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి సన్నాహాల్లో బిజీగా ఉంది. ఢిల్లీలో ఉన్న సీఎం నయాబ్ సైనీ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ నుంచి అందిన సమాచారం ప్రకారం హర్యానాలో ప్రమాణ స్వీకార తేదీని ఫిక్స్ చేశారు. అక్టోబరు 17న హర్యానాలో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో సీఎం, కేబినెట్ సహచరులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోసారి
హర్యానాలో అనూహ్య విజయం సాధించడంతో ప్రమాణ స్వీకారోత్సవం కూడా అంతే గ్రాండ్‌గా జరగనుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపబడ్డాయి. ఆ రోజు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. నాయబ్ సైనీ మరోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సైనీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవాన్ని పంచకులలో నిర్వహించనున్నారు. గతంలో చండీగఢ్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించగా, ఈసారి మార్పు కనిపిస్తోంది.
సీన్ రివర్స్
ఈసారి హర్యానా ఫలితాల గురించి మాట్లాడుకుంటే బీజేపీకి 48 సీట్లు రాగా, కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పాయి. కానీ సీన్ రివర్స్ అయ్యింది. దీంతో ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాయిబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. పలు సీట్లపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈవీఎంలపై కూడా పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
Dussehra 2024: దేశవ్యాప్తంగా మొదలైన దసరా వేడుకలు.. ఇక్కడ దేశంలో ఎత్తైన రావణుడి విగ్రహం
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 12 , 2024 | 01:36 PM