ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jharkhand train accident: ఇదే నా పాలన అంటే.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత

ABN, Publish Date - Jul 30 , 2024 | 10:39 AM

హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.

West Bengal Chief Minister Mamata Banerjee

కోల్‌కతా, జులై 30: హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ క్రమంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

Also Read: Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు


ఇదేనా పాలనా?...

ఇదేనా పాలనా? ప్రతి వారం ఈ పీడ కలల పరంపర కొనసాగుతుంది. రైల్వే ట్రాక్‌ మీద చోటు చేసుకుంటున్న ఈ మరణాలు, ఈ గాయాల ఘటనలకు ముగింపు లేదా?.. దీనిని మనం ఎంత కాలం సహించాలి. భారత ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంతం లేదా?.. ఇదేనా పాలనా అంటూ మోదీ ప్రభుత్వానికి ఆమె చురకలంటించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయాలపాలైన వారు వెంటనే కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Also Read: Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు


ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు..

జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు చక్రధర్‌పూర్ డివిజన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఇక జార్ఖండ్ ఎమ్మెల్యే కల్పనా ముర్ము సైతం ఈ ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే సైరయికేల ఖర్స్‌వాన్ జిల్లా యాంత్రాంగం సహాయ చర్యలు చేపట్టిందని వివరించారు.

Also Read: President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన


వరుసగా రైలు ప్రమాదాలు... మండిపడుతున్న విపక్షాలు..

దేశవ్యాప్తంగా ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే నెలకి లేదా వారానికి ఒకటి చొప్పున దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైళ్లు ఢీకొనడం కానీ.. రైలు పట్టాలు తప్పడం కానీ.. చోటు చేసుకుంటున్నాయి. ఆ యా ప్రమాదాల్లో భారీగా ప్రయాణికులు మరణిస్తున్నారు. పదుల సంఖ్యలో గాయాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 02:43 PM

Advertising
Advertising
<