Boat Capasizes in Goa: గోవాలో టూరిస్ట్ పడవ బోల్తా, ఒకరు మృతి, 20 మంది సురక్షితం
ABN , Publish Date - Dec 25 , 2024 | 08:17 PM
పడవ ప్రమాదంలో రక్షించిన 20 మందిని సమీప ఆసుపత్రికి తరలించామని, ప్రయాణికుల్లో ఇద్దరు మినహా పిల్లా పెద్దలందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
పనజి: క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్ల కోసం గోవా (Goa) బీచ్‌కు పర్యటకులు పెరుగుతున్న వేళ బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నార్త్ గోవాలోని కాలంగుటె బీచ్ అరేబియన్ సముద్రంలో పర్యాటకుల పడవ బోల్తా పడి ఒకరు మరణించారు. 20 మందిని రెస్య్కూ టీమ్ కాపాడింది. మరణించిన వ్యక్తిని 54 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Delhi Polls: పొత్తు పొరపాటే... ఢిల్లీ కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
పడవ ప్రమాదంలో రక్షించిన 20 మందిని సమీప ఆసుపత్రికి తరలించామని, ప్రయాణికుల్లో ఇద్దరు మినహా పిల్లా పెద్దలందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తీర ప్రాంతానికి సుమారు 60 మీటర్ల దూరంలో పడవ బోల్తాపడిందని, దీంతో అందరూ సముద్రంలో పడిపోయారని లైఫ్ సేవింగ్ ఏజెన్సీ దృష్టి మెరైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పడవలోని 13 మంది మహారాష్ట్రలోని ఖేడ్ నుంచి వచ్చారని, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని వివరించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విధి నిర్వహణలో ఉన్న 18 మంది లైఫ్‌సేవర్లు ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారని, వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించి కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
ముంబై పడవ ప్రమాదం
కాగా, గోవా ఘటనకు వారం రోజుల మీదే ముంబై తీర ప్రాంతంలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఇంజన్ ట్రయిల్స్‌లో ఉన్న నేవీ క్రాఫ్ట్ అదుపుతప్పి "నీల్ కమల్'' అనే ప్రయాణికుల పడవను ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంట్ ఐలాండ్‌కు 100 మంది ఫెర్రీలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Karnataka: రోడ్డుకు సీఎం పేరు.. మండిపడిన విపక్షాలు
Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్
For National News And Telugu News