ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ooty train: డీజిల్‌ ఇంజన్‌తో ఊటీ రైలు ట్రయల్‌ రన్‌

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:41 AM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నీలగిరి కొండరైలు(Neelagiri Hill Train)లో ప్రయాణించడానికి దేశవిదేశాల పర్యాటకులు ఆసక్తికనబరుస్తుంటారు. ఆ రైలులో ప్రయాణిస్తూ కున్నూరు - నుండి మేట్టుపాళయం దాకా ఇరువైపులా పచ్చదనంతో కూడిన పర్వతాల అందాలను, ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడం అందరికీ వింత అనుభూతిని కలిగిస్తుంది.

చెన్నై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నీలగిరి కొండరైలు(Neelagiri Hill Train)లో ప్రయాణించడానికి దేశవిదేశాల పర్యాటకులు ఆసక్తికనబరుస్తుంటారు. ఆ రైలులో ప్రయాణిస్తూ కున్నూరు - నుండి మేట్టుపాళయం దాకా ఇరువైపులా పచ్చదనంతో కూడిన పర్వతాల అందాలను, ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడం అందరికీ వింత అనుభూతిని కలిగిస్తుంది. ఆ కొండరైలింజన్‌ను ఇప్పటివరకూ ఫర్నేస్‌ ఆయిల్‌ ద్వారా నడుపుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Nara Bhuvaneshwari: సరదా సరదాగా.. విద్యార్థులతో మమేకమైన నారా భువనేశ్వరి


ఆ రైలింజన్‌ నుండి వెలువడే కారుమబ్బుల్లాంటి దట్టమైన పొగల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని భావించిన రైల్వే అధికారులు డీజిల్‌ ఇంజన్‌ మార్చారు. గత యేడాది కున్నూరు నుండి తిరుచ్చి పొన్‌మలై యార్డు(Trichy Ponmalai Yard)కు మరమ్మతు కోసం తీసుకెళ్ళి పెట్టా క్వీన్‌ అనే ఈ ఇంజన్‌ను డీజిల్‌ ఇంజన్‌గా మార్చి, కొత్తగా పెయింటింగ్‌ చేసి మేట్టుపాళయానికి బుధవారం తీసుకువచ్చారు.


ఆ తర్వాత మేట్టుపాళయం నుండి కున్నూరు దాకా ఆ రైలింజన్‌ను ఇంజనీరింగ్‌ నిపుణులు పర్యవేక్షణలో నడిపారు. ఆ తర్వాత ఇంజన్‌ సామర్థ్యాన్ని కూడా తనిఖీ చేసి ఇంజనీర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో డీజిల్‌ ఇంజన్‌తో కూడిన కొండ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 11:41 AM