Atishi: ఓటర్ల జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర.. సీఎం సంచలన ఆరోపణ
ABN, Publish Date - Nov 26 , 2024 | 07:38 PM
అక్టోబర్ 28న 29 మంది సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు, అదనపు జిల్లా మెజిస్ట్రేట్లను బదిలీ చేయడం ద్వారా కుట్రకు బీజేపీ తెరతీసిందని అతిషి ఆరోపించారు. ఆ తర్వాత స్వల్వ వ్యవధిలోనే ఓటర్ల జాబితా నుంచి ఆప్ ఓటర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చిందని, ఈ ఉత్తర్వులు నేరుగా ఎస్‌డీఎం కార్యాలయాల నుంచి వచ్చాయని చెప్పారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం భారీ కుట్రకు తెరలేపిందని ముఖ్యమంత్రి అతిషి (Atishi) సంచలన ఆరోపణలు చేసారు. ముఖ్యంగా ఆప్‌ను అనూకూల ఓటర్లను జాబితా నుxచి పెద్దఎత్తున తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాగాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సోషల్ మీడియా 'ఎక్స్'లో ఆమె పేర్కొన్నారు.
Ramdas Athawale: షిండే హ్యాపీగా లేరు.. కేంద్ర మంత్రి వెల్లడి
అక్టోబర్ 28న 29 మంది సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు, అదనపు జిల్లా మెజిస్ట్రేట్లను బదిలీ చేయడం ద్వారా కుట్రకు బీజేపీ తెరతీసిందని అతిషి ఆరోపించారు. ఆ తర్వాత స్వల్వ వ్యవధిలోనే ఓటర్ల జాబితా నుంచి ఆప్ ఓటర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చిందని, ఈ ఉత్తర్వులు నేరుగా ఎస్‌డీఎం కార్యాలయాల నుంచి వచ్చాయని చెప్పారు. ఆప్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజస్ట్రేషన్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లకు (ఎఈఆరోవో-బీఎల్ఓ) ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. 29 మంది ఎస్‌డీఎంలు-ఏడీఎంలను బదిలీ చేసిన తర్వాత ఆప్ సపోర్టర్లు, ఓటర్ల జాబితాను అధికారులకు హ్యాండోవర్ చేసినట్టు అతిషి పేర్కొ్న్నారు ఏఈఆర్‌వో-బీఎల్ఓ అధికారులు ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా బీజేపీ కుట్రను బహిర్గతం చేయాలని ఏఈఆర్ఓ-బీఎల్ఓ అధికారులను ఆమె కోరారు. అధికారులపై ఒత్తిడిలు వస్తే దానిని వెంటనే రికార్డు చేసి తనకు పంపాలని, వెంటనే తాము తక్షణ చర్యలు తీసుకుంటామని ఏఈఆర్ఓ-బీఎల్‌ఓ అధికారులకు సీఎం విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫిబ్రవరిలో జరగాల్సి ఉండగా, వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆప్ ఉంది. చివరిసారిగా 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు ఆప్ 62 స్థానాలను గెలుచుకుని తిరుగులోని ఆధిక్యత చాటుకుంది.
ఇవి కూడా చదవండి..
Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట
President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’
Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 26 , 2024 | 07:38 PM