ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: అత్తపై 95 వేట్లు వేసి చంపిన కోడలు.. మరణ శిక్ష విధించిన కోర్టు

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:56 AM

రెండేళ్ల కింద కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కొడవలితో 95 వేట్లు వేసి దారుణంగా చంపిన కోడలికి మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. రేవా

భోపాల్: రెండేళ్ల కింద కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కొడవలితో 95 వేట్లు వేసి దారుణంగా చంపిన కోడలికి మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. రేవా జిల్లాలోని అత్రైలాకు చెందిన 24 ఏళ్ల కంచన్‌కోల్‌, అత్త సరోజ్‌ కోల్‌ (50)కు మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి.


ఈ నేపథ్యంలోనే గృహహింస కేసు కూడా నమోదైంది. అయితే 2022 జూలైలో ఎవరూ లేని సమయంలో కోడలు కంచన్‌కోల్‌ అత్తపై కొడవలితో విరుచుకుపడి విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా చంపింది. ఇంటికి వచ్చిన ఆమె భర్త, సరోజ్‌కోల్‌ కొడుకు వాల్మిక్‌ కోల్‌ దీనిపై పోలీసులకు సమాచారమందించాడు.


కోర్టు తాజాగా కంచన్‌కోల్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి భర్త వాల్మిక్‌ను ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. అతను తల్లిని హత్య చేయించడానికి భార్యకు సలహాలిచ్చారని ఆరోపణలు వచ్చాయి. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది.

Updated Date - Jun 13 , 2024 | 06:35 AM

Advertising
Advertising