Supreme Court: పరిహారం ఇచ్చారని శిక్ష తగ్గకూడదు: సుప్రీం కోర్టు
ABN, Publish Date - Jun 07 , 2024 | 08:44 AM
సమాజంలో ఎన్ని నేరాలు చేసినా కొందరు తమ పలుకుబడితో పరిహారాన్ని(Compensation) ఇచ్చి శిక్ష నుంచి తప్పించుకుంటారు. అలాంటి వారి వల్ల దేశంలో రోజురోజుకి నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది.
ఢిల్లీ: సమాజంలో ఎన్ని నేరాలు చేసినా కొందరు తమ పలుకుబడితో పరిహారాన్ని(Compensation) ఇచ్చి శిక్ష నుంచి తప్పించుకుంటారు. అలాంటి వారి వల్ల దేశంలో రోజురోజుకి నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిహారం ఇచ్చారనే కారణంతో ధనవంతులకైనా శిక్ష తగ్గించకూడదని కోర్టు పేర్కొంది.
"పరిహారం చెల్లించారన్న కారణంతో తగ్గించే విధానం తీసుకొస్తే నేర న్యాయవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. చట్టం నుంచి ధనవంతులైన నిందితులు తప్పించుకొనే అవకాశం ఉంటుంది. శిక్ష వేరు, పరిహారం వేరు. వాటిని కలిపి చూడకూడదు. క్రిమినల్ కేసులో నష్టానికి లేదా గాయపడ్డవారికి కోలుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది. నిందితుడికి శిక్ష తగ్గించడానికి ఇది కారణం కాకూడదు. అలా చేస్తే.. డబ్బు, పలుకుబడి ఉన్న నేరస్థులు చట్టం నుంచి తప్పించుకుంటారు. దీంతో నేర న్యాయ ప్రక్రియ ఉద్దేశమే దెబ్బతింటుంది" అని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓ క్రిమినల్ కేసులో గుజరాత్ హైకోర్టు ఇద్దరు దోషులకు ఐదేళ్ల శిక్షను నాలుగేళ్లకు తగ్గిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
బాధితురాలికి రూ.2.50 లక్షలు చెల్లిస్తే, దోషులు నాలుగేళ్ల శిక్ష కూడా అనుభవించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు పేర్కొంది.ఈ తీర్పును సవాలు చేస్తూ రాజేంద్ర భగవాన్‌జీ ఉమ్రానియా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యలు చేసింది.
For Latest News and National News click here
Updated Date - Jun 07 , 2024 | 08:44 AM