ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nirmala Sitharaman: లోకల్ ట్రైన్ లో నిర్మలమ్మ సెల్ఫీ.. ప్రయాణీకులతో బాతాకానీ..

ABN, Publish Date - Feb 24 , 2024 | 05:12 PM

ప్రజా సమస్యలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నేతలు అప్పుడప్పుడు తమ కోసం కొన్ని చిన్న చిన్న పనులు చేస్తుంటారు. పదవి, హోదాను మరిచి సాధారణ ప్రజల్లా వ్యవహరిస్తుంటారు. గల్లీ నేతల నుంచి దిల్లీ నాయకుల వరకు తమకు ఎప్పుడైనా కాస్త విరామ సమయం దొరికితే చాలు..

ప్రజా సమస్యలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నేతలు అప్పుడప్పుడు తమ కోసం కొన్ని చిన్న చిన్న పనులు చేస్తుంటారు. పదవి, హోదాను మరిచి సాధారణ ప్రజల్లా వ్యవహరిస్తుంటారు. గల్లీ నేతల నుంచి దిల్లీ నాయకుల వరకు తమకు ఎప్పుడైనా కాస్త విరామ సమయం దొరికితే చాలు.. నచ్చింది చేస్తుంటారు. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహాయింపేమీ కాదు. దేశార్థికాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేసే ఆమె.. లోకల్ ట్రైన్ లో ప్రయాణించడం విశేషం.

ముంబయి లోకల్ ట్రైన్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కారు. దీంతో అక్కడున్న సాధారణ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కేంద్ర మంత్రి తమతో కలిసి ప్రయాణం చేయడాన్ని వారు నమ్మలేకపోయారు. అంతే కాకుండా మంత్రి నిర్మల.. వారితో సరదా కబుర్లు చెప్పారు. చివర్లో అందరితో ఆమె సెల్ఫీ దిగారు. ఘట్‌కోపర్ నుంచి కళ్యాణ్ వరకు లోకల్ ట్రైన్ లో ఆమె ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో ట్వీట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.


కాగా.. లోకల్ రైళ్లు ముంబయికి లైఫ్ లైన్‌గా మారి సేవలందిస్తున్నాయి. రోజూ 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం గతంలో అనేక సందర్భాల్లో ప్రజా రవాణా ద్వారా ప్రయాణికులతో ముచ్చటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 05:12 PM

Advertising
Advertising