ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha polls 2024: రాహుల్‌ను 'మెజీషియన్'తో పోల్చిన మోదీ

ABN, Publish Date - Apr 14 , 2024 | 04:11 PM

దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వాగ్దానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛలోక్తులు విసిరారు. రాహుల్‌ని 'రాయల్ మెజీషియన్'గా అభివర్ణించారు. విపక్ష 'ఇండియా' కూటమి మేనిఫెస్టోలోని ప్రతి అంశం ఇండియాను ఆర్థికంగా దివాళా తీయించడం ఖాయమన్నారు.

హోసంగాబాద్: దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వాగ్దానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఛలోక్తులు విసిరారు. రాహుల్‌ని 'రాయల్ మెజీషియన్'గా అభివర్ణించారు. విపక్ష 'ఇండియా' కూటమి మేనిఫెస్టోలోని ప్రతి అంశం ఇండియాను ఆర్థికంగా దివాళా తీయించడం ఖాయమన్నారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని హోసంగాబాద్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ, దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో తరిమికొడతామంటూ కాంగ్రెస్ ప్రిన్స్ (రాహుల్) ఆశ్చర్యకరమైన హామీ ఇచ్చారని అన్నారు. యావద్దేశం ఆయన ప్రకటన చూసి ఆశ్చర్యానికి లోనైందని, ఈ 'రాయల్ మెజీషియన్' ఇన్నేళ్లు ఎక్కడ దాక్కున్నారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.


రాహుల్ గాంధీ గత వారంలో రాజస్థాన్‌లోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తామని అన్నారు. ''మీరు పేదిరికపు రేఖకు దిగువన ఉంటే ఏటా రూ.లక్ష ఇస్తాం. ఆ అమౌంట్‌తో దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తాం'' అని చెప్పారు. 'మహాలక్ష్మి పథకం' కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏటా రూ.లక్ష సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం చేసింది.

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కీలక స్పీచ్.. వచ్చే ఐదేళ్లలో..


బాధ్యత లేని మేనిఫెస్టో..

కాగా, 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్‌తో పాలన సాగించిందని, పేదలను పట్టించుకోలేదని అన్నారు.'ఇండియా బ్లాక్' ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజల పట్ల ఎలాంటి బాధ్యత కానీ, కమిట్‌మెంట్‌ కానీ లేవని హోసంగాబాద్‌ ర్యాలీలో మోదీ విమర్శించారు. మేనిఫెస్టోలో పలు ప్రమాదకరమైన వాగ్దానాలు చేశారని అన్నారు. ఆ మేనిఫెస్టోతో దేశం దివాళా తీయడం ఖాయమన్నారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే దేశం తగులబడుతుందని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ బెదిరిస్తోందని, కేవలం అసూయతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తు్న్నారని అన్నారు. మోదీని 140 కోట్ల మంది ప్రజానీకం అభిమానించడమే వాళ్ల అసూయకు కారణమని మోదీ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 04:11 PM

Advertising
Advertising