ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ఏకంగా 100 మిలియన్ల ఫాలోవర్లు

ABN, Publish Date - Jul 14 , 2024 | 09:29 PM

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీ మరో చరిత్ర సృష్టించారు. ఆయన ఎక్స్ ఖాతాను(@narendramodi) అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా ఆయన మరో రికార్డు నెలకొల్పారు.

ఢిల్లీ: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీ మరో చరిత్ర సృష్టించారు. ఆయన ఎక్స్ ఖాతాను(@narendramodi) అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా ఆయన మరో రికార్డు నెలకొల్పారు.

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన నెలకొల్పిన తొలి రికార్డ్ ఇదే. చాలా మంది రాజకీయ నాయకులకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, మోదీ వారందరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.


లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి ఎక్స్‌లో 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్లు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు 19.9 మిలియన్లు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.4 మిలియన్లు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు 6.3 మిలియన్లు, తేజస్వి యాదవ్‌కు 5.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు 2.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(38.1), పోప్ ఫ్రాన్సిస్(18.5) ఫాలోవర్లు ఉన్నారు. ఇక మోదీకి యూట్యూబ్‌లో 25 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 91 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆయన 2009లో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.


అప్పటి నుంచి రాజకీయాలు, సందేశాత్మక పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఆకర్షణీయమైన పోస్టులను ఆయన రీపోస్ట్ చేస్తారు. సాధారణ పౌరులను కూడా అనుసరిస్తారు. వారి సందేహాలను తీరుస్తారు. పెయిడ్ ప్రమోషన్లు, బాట్‌లను ఆయన ఎప్పుడూ ఆశ్రయించలేదు. ఎవరినీ బ్లాక్ చేయలేదు. బీజేపీ వరుసగా మూడో సారి గెలవడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణమే. ఇందులో మోదీ సోషల్ మీడియా అకౌంట్లు కీలకంగా వ్యవహరించాయి.

Read International News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 09:29 PM

Advertising
Advertising
<