ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi: కాంగ్రెస్‌ను నడిపించేది.. అర్బన్‌ నక్సల్స్‌

ABN, Publish Date - Sep 21 , 2024 | 05:00 AM

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌, అర్బన్‌ నక్సలైట్లే నడిపిస్తున్నారని, వీరంతా అత్యంత అవినీతిపరులని, విభజనవాదులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

  • విద్వేష దెయ్యం’ ఆ పార్టీలో ప్రవేశించింది

  • అబద్ధం, ద్రోహం.. కాంగ్రెస్‌ లక్షణాలు

  • తెలంగాణ సమాజానికీ ఆ పార్టీ ద్రోహం

  • నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ

వార్ధా, సెప్టెంబరు 20: కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌, అర్బన్‌ నక్సలైట్లే నడిపిస్తున్నారని, వీరంతా అత్యంత అవినీతిపరులని, విభజనవాదులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 138 ఏళ్ల వయసున్న కాంగ్రెస్‌ పార్టీ చివరకు గణపతిని పూజించినా ద్వేషిస్తోందని అన్నారు. ‘‘ఈ రోజు మీరు చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. నాడు మహాత్మాగాంధీ వంటి గొప్ప నాయకులు కలిసి నడిచిన పార్టీ కాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రె్‌సలోకి విద్వేషమనే దెయ్యం ప్రవేశించింది. ఆ పార్టీలో దేశ భక్తి అనే ఆత్మ నశించిపోయింది.


విదేశాల్లో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులు(రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించకుండా) భారత వ్యతిరేక ఎజెండాను ఎంచుకున్నారు. అవినీతిమయమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సే. అత్యంత అవినీతిమయమైన కుంటుంబం ఏదైనా ఉంటే అది రాచరిక కుటుంబమే(గాంధీల కుటుంబం). గణపతిని పూజించడాన్నీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను గణపతిని పూజించేందుకు వెళ్తే.. తమ బుజ్జగింపు రాజకీయాల కోసం దానిపై కూడా కాంగ్రెస్‌ విమర్శలు చేసింది. కర్ణాటక(కాంగ్రెస్‌ ప్రభుత్వం)లో గణపతిని జైల్లో పెట్టారు. మరో గణపతి విగ్రహాన్ని పోలీసు జీపు ఎక్కించారు. గణపతిని ఇంతలా అవమానించినా మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ మిత్రులు శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు నోటికి తాళాలు వేసుకున్నాయి. వారి ద్వంద్వ రాజకీయాల పట్ల మనంగా అప్రమత్తంగా ఉండాలి. అబద్ధం, ద్రోహం అనేవి కాంగ్రెస్‌ హాల్‌మార్క్‌. ఈ పార్టీ విషయంలో మహారాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.


  • తెలంగాణలో ఇచ్చిన హామీలేమయ్యాయి?

అన్నదాతల ఆశలను, ఆకాంక్షలను ధ్వంసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి మరో అవకాశం ఇవ్వద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయాలు, అవినీతి కోసమే రైతులను వాడుకుందని దుయ్యబట్టారు. ‘‘గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ లెక్కకు మిక్కిలిగా హామీలు గుప్పించింది. కానీ, అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అటకెక్కించి.. తెలంగాణ సమాజానికి ద్రోహం చేసింది’’ అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ ప్రయత్నించలేదని విమర్శించారు. ‘‘కళాకారులు కేవలం కళాకారులుగా ఉండిపోకూడదు. వారంతా వ్యాపార వేత్తలుగా ఎదగాలన్నది మా ఆలోచన’’ అని ప్రధాని తెలిపారు.


  • మోదీ ఎక్కడున్నారు?

మోదీ మహారాష్ట్ర పర్యటనపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ‘‘మహాత్మాగాంధీ-నాథూరాం గాడ్సేల మధ్య ప్రధాని ఎక్కడున్నారు’’ అని నిలదీసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌.. ప్రధానికి 3 ప్రశ్నలు సంధించారు. ‘‘రైతుల ఆత్మహత్యలు నిలువరించేందుకు బీజేపీ ఏం చేసింది? అటవీ హక్కుల చట్టం అమలులో ఆదివాసీల హక్కులను ఎందుకు పక్కన పెట్టింది? గాంధీ-గాడ్సేల మధ్య ప్రధాని ఎక్కడ ఉన్నారు?’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. మహారాష్ట్రలోనే రోజుకు సగటున ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిని మోదీ ఎందుకు ప్రస్తావించలేదని జైరాం నిలదీశారు.

Updated Date - Sep 21 , 2024 | 05:00 AM