Maharashtra: నన్ను సజీవ సమాధి చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి
ABN, Publish Date - May 11 , 2024 | 04:17 AM
ప్రతిపక్షాలకు చెందిన కొందరు తనని సజీవసమాధి చేయాలని అనుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, దేశ ప్రజలు తనకు రక్షణ కవచంలా ఉన్నంత వరకు తనని ఎవరు ఏం చేయలేరని తెలిపారు. మహారాష్ట్రలోని నందుర్బార్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి హీనా గవిత్‌కు మద్దతుగా ప్రధాని మోదీ గురువారం ప్రచారం నిర్వహించారు.
దేశ ప్రజలే నాకు రక్షణ కవచం : ప్రధాని నరేంద్ర మోదీ
నందుర్బార్, మే 10: ప్రతిపక్షాలకు చెందిన కొందరు తనని సజీవసమాధి చేయాలని అనుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, దేశ ప్రజలు తనకు రక్షణ కవచంలా ఉన్నంత వరకు తనని ఎవరు ఏం చేయలేరని తెలిపారు. మహారాష్ట్రలోని నందుర్బార్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి హీనా గవిత్‌కు మద్దతుగా ప్రధాని మోదీ గురువారం ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలో మోదీని సజీవ సమాధి చేస్తామంటూ శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా కౌంటరిచ్చిన మోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. తమ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు శివసేన(యూబీటీ) నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాక, బాంబు పేలుళ్లకు పాల్పడిన వారితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ముంబై వాయవ్య ఎంపీ స్థానం శివసేన(యూబీటీ) అభ్యర్థి అమోల్ కీర్తికర్ ఎన్నికల ప్రచారంలో 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఇక్బాల్ ముసా అలియాస్ బాబా చౌహాన్ పాల్గొన్నారని బీజేపీ బుధవారం ఆరోపించింది. కాగా, జూన్ 4 తర్వాత చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రె్‌సలో విలీనం అవుతాయంటూ ఎన్సీపీ(ఎస్పీ)నేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపైనా ప్రధాని మోదీ స్పందించారు. ఎన్సీపీ(ఎస్పీ), శివసేన (యూబీటీ) పార్టీలు కాంగ్రె్‌సలో చేరి అంతమైపోవడం కంటే అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే చేతులకలపాలని సూచించారు. అలాగే, శ్రీకృష్ణుని శరీర రంగులో ఉన్న వారిని ఆఫ్రికన్లు అంటూ అవమానించిన కాంగ్రె్‌సకు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉండడం ఇష్టం లేదని, ఇది ఆదివాసీలను అవమానించడం కాదా ? అని ప్రశ్నించారు. కాగా, మోదీ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని వ్యక్తులు, పార్టీలతో తాము ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలపబోమని స్పష్టం చేశారు.
Updated Date - May 11 , 2024 | 07:14 AM