ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: కెన్-బెత్వా నధుల అనుసంధాన ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:00 PM

కెన్-బెత్వా రీవర్ లింకింగ్ నేషనల్ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు ఇరిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి లక్షలాది మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

ఖజురహో: నధుల అనుసంధానంలో మొదటిదైన కెన్-బెత్వా నధుల అనుసంధాన ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహో (Khajuraho)లో బుధవారంనాడు ప్రారంభించారు. రెండు నదుల జలాలను ఆయన ప్రాజెక్టు నమూనాలో పోశారు. అనంతరం రిమోట్ బటన్ సాయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ శత జయంతిని పురస్కరించుకుని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కెన్-బెత్వా రీవర్ లింకింగ్ నేషనల్ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు ఇరిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి లక్షలాది మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తాగునీటి సౌకర్యం కూడా ఈ ప్రాంత వాసులకు లభ్యమవుతుంది.

Lavu Krishna Devarayalu: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ


ప్రాజెక్టు శుంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాడ్లాడుతూ, ఈరోజు యావత్ ప్రపంచం క్రిస్మమ్ వేడుక జరుపుకుంటోందని, దేశవిదేశాల్లోని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలని అన్నారు. ముఖ్యమంత్రి మోహన్ లాల్ యాదవ్ సారధ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంటున్నందున ఆయనకు, బీజేపీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు అభినందలు తెలియజేస్తున్నానని చెప్పారు. గత ఏడాది అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందని, ఈరోజు కోట్లాది రూపాయలు విలువజేసే అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. కెన్-బెత్వా రీవర్ లింకింగ్ ప్రాజెక్టును కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఇదేరోజు భారతరత్న వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు జరుపుకొంటున్నామని, ఇది సుపరిపాలన పండుగని, సుపరిపాలన అంటేనే బీజేపీ అని మోదీ అన్నారు.


బుందేల్‌ఖండ్ ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు ఏళ్ల తరబడి కాంగ్రెస్ అబద్ధాలు చెబుతూ వచ్చిందన్నారు. ఈ ప్రాంతానికి ప్యాకేజీ ఇస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ఈరోజు బుందేల్‌ఖండ్‌లోని 11 జిల్లాలకు తాగునీరు, ఇరిగేషన్, ఇండస్ట్రీలకు జలాలు అందనున్నాయని చెప్పారు.


వాజ్‌పేయి స్మారక స్టాంపు విడుదల

కెన్-బెత్వా రివర్ లింగ్ ప్రాజెక్టు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని స్మారక తపాలా బిళ్లను, రూ.100 నాణేన్ని మోదీ విడుదల చేశారు. అటల్ గ్రామ్ సుశాన్ బిల్డింగ్‌లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.



ఇది కూడా చదవండి..

Arvind Kejriwal: త్వరలోనే అతిషిని అరెస్టు చేస్తారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్‌

For National News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 04:00 PM