West Bengal: ఓ వర్గం ఓట్లు పొందేందుకు రామకృష్ణ మిషన్‌పై దాడి.. దీదీపై మోదీ విమర్శలు
ABN, Publish Date - May 19 , 2024 | 03:48 PM
ఓ వర్గం ఓట్లు పొందేందుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) హిందూ సంఘాలపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు.
పురూలియా: ఓ వర్గం ఓట్లు పొందేందుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) హిందూ సంఘాలపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. పురూలియాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
రామకృష్ణ మిషన్, భారత్ సేవా శ్రమ సంఘాలపై దీదీ వ్యాఖ్యలను ఖండించారు. టీఎంసీ వీటికి వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడి టీఎంసీ హద్దులు దాటిందని, వాటిని దీదీ బెదిరిస్తోందని ఇది కేవలం ఓ వర్గం ఓటు బ్యాంకును పొందేందుకే అని విమర్శించారు.
దీదీ ఏమన్నారంటే..
ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో దీదీ మాట్లాడుతూ.. "రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నేతల ప్రభావంతో పనిచేస్తున్నారు. దేవాలయాలను చూసుకునే వారు గొప్ప ఆధ్యాత్మిక ఉద్యోగులు. కానీ కొందరి ప్రమేయంతో రాజకీయాలు చేస్తున్నారు" అని దీదీ ఆరోపించారు.
PM Modi: ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Read Latest National News and Telugu News
Updated Date - May 19 , 2024 | 03:48 PM