PM Narendra Modi: నేను ముస్లిం, ఇస్లాంలకు వ్యతిరేకం కాదు.. ప్రధాని మోదీ క్లారిటీ
ABN, Publish Date - May 07 , 2024 | 06:53 PM
తనతో పాటు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమనే విమర్శలు వస్తున్న తరుణంలో.. ప్రధాని నరేంద్ర మోదీ వాటిపై స్పందించారు. తాను ఇస్లాంకు, ముస్లింలకుఏమాత్రం వ్యతిరేకం కాదని.. ప్రతిపక్షాలే ఈ కథనాల్ని ప్రచారం..
తనతో పాటు బీజేపీ (BJP) ముస్లింలకు (Muslims) వ్యతిరేకమనే విమర్శలు వస్తున్న తరుణంలో.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) వాటిపై స్పందించారు. తాను ఇస్లాంకు (Islam), ముస్లింలకుఏమాత్రం వ్యతిరేకం కాదని.. ప్రతిపక్షాలే ఈ కథనాల్ని ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. విపక్షాల అబద్ధాలు బయటపడటం వల్లే.. వాళ్లు తమపై ఈ అసత్య ప్రచారానికి తెరలేపాయని ఆరోపించారు. తాను ఎవరిపైనా వివక్ష చూపడం లేదన్న విషయం స్వయంగా ముస్లింలు కూడా అర్థం చేసుకున్నారని అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఇండియా’ కూటమికి ముహూర్తం ఫిక్స్.. ప్రధాని మోదీ వార్నింగ్
‘‘మేము ముస్లింలకు గానీ, ఇస్లాంకి గానీ వ్యతిరేకం కాదు. అసలు అది మా విధానమే కాదు. నెహ్రూ కాలం నుంచే విపక్షాలు ఈ కథనాల్ని ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ముస్లిం వ్యతిరేకులంటూ ఆరోపణలు చేస్తూ.. దాన్నుంచి వాళ్లు లబ్ది పొందాలని చూస్తున్నారు. తాము ముస్లింలకి స్నేహితులమంటూ విపక్షాలు కపట ప్రేమని ప్రదర్శిస్తున్నాయి. కానీ.. ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారింది. తాను ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయడంతో పాటు ఆయుష్మాన్ కార్డులు, కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు.. నేను నిజాయితీగానే ఉన్నానని ముస్లిం సోదరీమణులు భావించారు. నేను ఎవరిపై కూడా వివక్ష చూపట్లేదని వాళ్లు అర్థం చేసుకున్నారు’’ అని ప్రధాని మోదీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు రకరకాల అబద్ధాలు చెప్తూనే ఉంటారని ఆయన ధ్వజమెత్తారు.
ధోనీ 9వ స్థానంలో రావడానికి కారణమిదే.. విమర్శకులకు కౌంటర్
ఇదిలావుండగా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదని ముస్లింలకు పంచి పెడుతుందంటూ కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బంగారంతో పాటు సంపద మొత్తం సర్వే చేసి.. దాన్ని చొరబాటుదారులకి, ఎక్కువమంది పిల్లలున్న వారికి పంచుతారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాలు స్పందిస్తూ.. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే మోదీ ఇలా ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాయి. ఈ క్రమంలోనే మోదీ పై విధంగా బదులిచ్చారు. ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ.. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని, భయాందోళనతో కూడిన వాతావరణం కారణంగా ఏ సమాజమూ కట్టుబానిస జీవితాన్ని గడపాలని తాను కోరుకోవడం ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 07 , 2024 | 06:53 PM