ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi : ‘వికసిత్‌ భారత్‌’కు దక్షిణాదే కీలకం

ABN, Publish Date - Sep 01 , 2024 | 04:20 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  • తమిళనాడు అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం: మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 31: వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాది అభివృద్ధికి.. అందులోనూ తమిళనాడు అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కేటాయింపులు పెంచామని గుర్తు చేశారు.

శనివారం ఆయన మూడు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను(మీరట్‌-లఖ్‌నవూ, మదురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌ కోయిల్‌ రూట్ల మధ్య) వర్చువల్‌గా ప్రారంభించారు. వందేభారత్‌ రైళ్లను అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో దేశం ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేలా రైల్వేలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చామని, ప్రతీ ఒక్కరికి సౌకర్యవంతమైన రైల్వే ప్రయాణ సేవలను అందించేవరకు ఈ సంస్కరణలు ఆగబోవని మోదీ చెప్పారు.

Updated Date - Sep 01 , 2024 | 04:20 AM

Advertising
Advertising