ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi Resignation: ప్రధాని మోదీ రాజీనామా.. మళ్లీ ముహూర్తం ఫిక్స్!

ABN, Publish Date - Jun 05 , 2024 | 03:05 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనతో సహా తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారంనాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్‌కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. అందుకు అంగీకరించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం జరిగేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తనతో సహా తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు బుధవారంనాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్‌కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. వాటిని రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం జరిగేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.

Lok sabha dissolution: 17వ లోక్‌సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడటం, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మెజారిటీ మార్క్ దాటి 292 సీట్లు గెలుచుకోవడంతో తిరిగి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ఈనెల 8న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో 17వ లోక్‌సభ రద్దుకు కేంద్రం మంత్రివర్గం బుధవారం ఉదయం మోదీ నివాసంలో సమావేశమై సిఫారసు చేసింది. అనంతరం తమ రాజీనామా పత్రాలను రాష్ట్రపతికి మోదీ సమర్పించారు.

For Latest News and National News Click Here

Updated Date - Jun 05 , 2024 | 03:47 PM

Advertising
Advertising