PM Modi: రూ.34 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం.. ఎక్కడంటే..?
ABN, Publish Date - Mar 02 , 2024 | 02:18 PM
పశ్చిమ బెంగాల్ నుంచి నేరుగా ప్రధాని మోదీ బీహార్ వెళతారు. అక్కడ రూ.34, 800 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్‌లో ఇటీవల జేడీయూ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి మోదీ బీహార్‌లో పర్యటిస్తున్నారు.
పాట్నా: పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) నుంచి నేరుగా బీహార్ (Bihar) వెళతారు. అక్కడ రూ.34, 800 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. బీహార్‌లో ఇటీవల జేడీయూ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీహార్‌లో తొలిసారి ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను బీహార్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
బీహార్‌లో గల బెగుసరాయ్‌లో రూ.13,400 కోట్లతో అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హర్యానా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, కర్ణాటక, కేజీ బేసిన్లలో చమురు, గ్యాస్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. వీటి విలువ రూ.1.48 లక్షల కోట్లు ఉంటుంది. కేజీ బేసిన్‌లో తొలి చమురు గ్యాస్‌ను జాతికి అంకితం చేస్తారు. ఓఎన్జీసీ కృష్ణా గోదావరి డీప్ వాటర్ ప్రాజెక్ట్ నుంచి తొలి ముడి చమురు నౌకను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2024 | 03:24 PM