ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: కాశీ విశ్వనాథుని దర్శించనున్న మోదీ

ABN, Publish Date - May 12 , 2024 | 09:26 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సోమవారం దర్శించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీన వారణాసి నుంచి ప్రధాన మంత్రి నామినేషన్ వేయనుండటంతో దీనికి ముందుగానే ఆయన కాశీ విశ్వనాథుని ఆశీస్సులు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని (Kashi Vishwanath temple) సోమవారం దర్శించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీన వారణాసి నుంచి ప్రధాన మంత్రి నామినేషన్ వేయనుండటంతో దీనికి ముందుగానే ఆయన కాశీ విశ్వనాథుని ఆశీస్సులు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం వారణాసిలో మోదీ రోడ్‌షోకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.


ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు వారణాసి సిద్ధంగా ఉందని, ప్రజలు మరోసారి ఆయనను గెలిపించాలని నిశ్చయిచుకున్నారని కేంద్ర మంత్రి, చాందౌలి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గానికి పని చేసినంతగా ఏ ప్రధాని తన నియోజకవర్గానికి పనిచేయలేదన్నారు. కాశీ మొత్తం ప్రధానికి అండగా నిలుస్తోంది, కచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీ మూడోసారి పోటీ చేస్తుండగా, ఆయనపై పోటీకి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ సైతం మూడోసారి బరిలో ఉన్నారు. జూన్ 1న జరిగే ఏడవ విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో పోలింగ్ జరుగనుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 12 , 2024 | 09:26 PM

Advertising
Advertising