ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: మోదీజీ.. ఇప్పుడైనా ఏపీకి ‘హోదా’ ఇస్తారా?: కాంగ్రెస్‌

ABN, Publish Date - Jun 07 , 2024 | 04:11 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇప్పుడైనా ఆ హామీని నెరవేరుస్తారా? అని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్‌కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌.. మోదీని ఉద్దేశిస్తూ నాలుగు ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోను గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘

న్యూఢిల్లీ, జూన్‌ 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇప్పుడైనా ఆ హామీని నెరవేరుస్తారా? అని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్‌కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌.. మోదీని ఉద్దేశిస్తూ నాలుగు ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోను గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘2014 ఏప్రిల్‌ 30న ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో మోదీ హామీ ఇచ్చా రు. పదేళ్లయినా ఆ హామీ నెరవేర్చలేదు. ఇప్పుడైనా ఏపీకి ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా’ అని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి.

ప్రైవేటీకరణ చేయడం ఆపేస్తారా మోదీజీ?’ అని ప్రశ్నించారు. 2014లోనే బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, ఇప్పటికీ దానిపై నోరు మెదపడం లేదన్నారు. బిహార్‌లో మాదిరిగా దేశమంతా కులగణన చేయిస్తామని హామీ ఇస్తారా? అని మోదీని ప్రశ్నించారు. ‘మోదీ 3.0’ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని పదే పదే చెబుతున్నారని, వాస్తవంగా ఈసారి ఏర్పడేది ‘మోదీ 1/3 ప్రభుత్వం’ అని జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 07 , 2024 | 07:10 AM

Advertising
Advertising