ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi: 9వ సారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. కారణమిదే

ABN, Publish Date - Sep 21 , 2024 | 07:04 AM

క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు రోజుల పర్యటనకు అమెరికా బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రసంగించంతోపాటు పలువురు నేతలతో భేటీ కానున్నారు.

PM Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొంటారు. పలు ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఇలా అన్నారు.''ఈరోజు నేను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకావాలని, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నాను. ఈ క్రమంలో మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తున్నాను. క్వాడ్ సమ్మిట్‌లో నా సహాచరులు ప్రెసిడెంట్ బైడెన్, ప్రధాన మంత్రి అల్బనీస్, ప్రైమ్ మినిస్టర్ కిషిడా సహా పలువురిని కలుస్తాను''.


9వ సారి అమెరికా పర్యటన

ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ ఇప్పటివరకు 8 సార్లు అమెరికాను సందర్శించారు. ఇప్పుడు తన తొమ్మిదవ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 21న డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరగనున్న క్వాడ్ లీడర్‌ల ఆరో సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారు.


మోదీ పర్యటన వివరాలు

ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికా పర్యటనలో ఉంటారు. ఆ సమయంలో ప్రధాని క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌తో పాటు అనేక కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. సెప్టెంబర్ 21న డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగే ఆరో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ఆయన హాజరవుతారు. దీని తర్వాత సెప్టెంబర్ 22న న్యూజెర్సీలో భారతీయ సమాజానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధాని మోదీ తన పర్యటన చివరి రోజైన సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో కూడా పాల్గొంటారు.


మోదీ రికార్డ్

ప్రధాని మోదీ ఈ పర్యటన నేపథ్యంలో ఓసారి భారత ప్రధానుల అమెరికా పర్యటన చరిత్రను పరిశీలిద్దాం. మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన పదవీకాలంలో 4 సార్లు అమెరికాను సందర్శించారు. ఆ తర్వాత మన్మోహన్‌సింగ్‌తో సహా మొత్తం 9 మంది భారత ప్రధానులు ఇప్పటివరకు అమెరికాను అధికారికంగా సందర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 8 సార్లు అమెరికాను సందర్శించగా, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 4 సార్లు అమెరికాను సందర్శించారు.

అదే సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా నాలుగు సార్లు అమెరికాను విజిట్ చేశారు. ఇది కాకుండా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మూడు సార్లు, పీవీ నరసింహారావు 2 సార్లు, మొరార్జీ దేశాయ్, I.K. గుజ్రాల్ ఒకసారి అమెరికా వెళ్లారు. దీన్ని బట్టి చూస్తే అత్యధికంగా(9 సార్లు) అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానులలో మోదీ మొదటి స్థానంలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Narendra Modi: కాంగ్రెస్‌ను నడిపించేది.. అర్బన్‌ నక్సల్స్‌


Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే


Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 21 , 2024 | 07:14 AM