Modi Kuwait Highest Honour: మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ''ది ఆర్డర్ ఆఫ్ ముబాకర్ అల్ కబీర్''
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:25 PM
కువైట్ అత్యున్నత పురస్కారాన్ని అందజేయానికి ముందు కువైట్ బయన్ ప్యాలెస్ వద్ద మోదీకి "గార్డ్ ఆఫ్ హానర్''తో సాదర స్వాగతం పలికారు. కువైట్ దేశ రాజు షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ కరచనాలతో ఆత్మీయ స్వాగతం తెలిపారు.
న్యూఢిల్లీ: కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi)కి ఆ దేశ అత్యున్నత పురస్కారం "ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్" పురస్కారాన్ని అదివారంనాడు అందజేశారు. దీంతో 'నైట్‌హుడ్ ఆర్డర్ ఆఫ్ ది కువైట్' గౌరవం అందుకున్న జాబితాలో మోదీకి చోటు లభించింది. కువైట్ అత్యున్నత పురస్కారాన్ని గతంలో అందుకున్న వారిలో బిల్ క్లింటన్, ప్రిన్స్ ఛార్లెస్, జార్జి బుష్ తదితరులు ఉన్నారు. 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్' పురస్కారంతో ఇంతవరకూ ప్రపంచ దేశాల నుంచి మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలు 20కి చేరుకున్నాయి.
Arvind Kejriwal: మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన రిజిస్ట్రేషన్ ఎప్పట్నించంటే
కువైట్ అత్యున్నత పురస్కారాన్ని అందజేయానికి ముందు కువైట్ బయన్ ప్యాలెస్ వద్ద మోదీకి "గార్డ్ ఆఫ్ హానర్''తో సాదర స్వాగతం పలికారు. కువైట్ దేశ రాజు షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ కరచనాలతో ఆత్మీయ స్వాగతం తెలిపారు. అనంతరం కువైట్ అత్యున్నత పురస్కారమైన "ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'ను మోదీకి షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ అందజేశారు.
కాగా, మోదీ రెండోరోజు కువైట్ పర్యటనలో భాగంగా అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి సారించనున్నారు . ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందంపై చర్చలు జరుగుతాయని, వీటితో పాటు పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరుగనున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.
Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు
Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..
For National News And Telugu News
Updated Date - Dec 22 , 2024 | 04:26 PM