ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాలికపై అత్యాచారం కేసులో రాజస్థాన్‌లో ఇద్దరికి మరణ శిక్ష

ABN, Publish Date - May 21 , 2024 | 04:56 AM

మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి ఆపై బొగ్గుల కొలిమిలో సజీవ దహనం చేసిన కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ రాజస్థాన్‌లోని బిల్వారాలో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ముద్దాయిలైన కాలూ, కన్హాలకు ఈ శిక్ష విధించిందని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహావీర్‌ సింగ్‌ కిష్ణావత్‌ చెప్పారు.

జైపూర్‌, మే 20: మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి ఆపై బొగ్గుల కొలిమిలో సజీవ దహనం చేసిన కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ రాజస్థాన్‌లోని బిల్వారాలో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ముద్దాయిలైన కాలూ, కన్హాలకు ఈ శిక్ష విధించిందని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహావీర్‌ సింగ్‌ కిష్ణావత్‌ చెప్పారు. సాక్ష్యాలను ఽధ్వంసం చేశారన్న ఆరోపణలపై మరో ఏడుగురిపై కేసులు పెట్టినప్పటికీ ఇందుకు తగిన ఆధారాలు లేవంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసిందని తెలిపారు.

దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. సంఘటన జరిగిన పది నెలల్లో నిందితులకు శిక్ష పడిందని తెలిపారు. గత ఏడాది ఆగస్టు రెండో తేదీన పశువులు మేపడానికి వెళ్లిన 14 ఏళ్ల బాలికపై ముద్దాయిలు ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం కర్రలతో తీవ్రంగా కొట్టారు. చనిపోయిందని భావించి మండుతున్న బొగ్గుల కొలిమిలో పడేశారు. దీనిపై అప్పటి అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేసింది. నిందితులు నేరం చేసినట్టు శనివారం పోక్సో కోర్టు ధ్రువీకరించి శిక్ష విధించింది.

Updated Date - May 21 , 2024 | 04:56 AM

Advertising
Advertising