Lok Sabha Election 2024: 57 స్థానాలకు లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ షురూ
ABN, Publish Date - Jun 01 , 2024 | 07:01 AM
లోక్‌సభ 2024 ఎన్నికల(Lok Sabha Election 2024) ఆరు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. నేడు (జూన్ 1న) ఏడో దశకు(seventh phase), ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా, సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
లోక్‌సభ 2024 ఎన్నికల(Lok Sabha Election 2024) ఆరు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. నేడు (జూన్ 1న) ఏడో దశకు(seventh phase), ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా, సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. దీంతో 543 స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన ఏడు దశల ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
ఏడో దశ(Phase 7)లో పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 9, బీహార్‌లోని 8, ఒడిశాలోని 6, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్‌లోని ఒక స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. చివరి దశ ఓటింగ్‌లో ఒడిశా అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలతో పాటు, హిమాచల్ అసెంబ్లీలోని ఆరు స్థానాల ఉపఎన్నికలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.
చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ(modi), కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut), ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి భవితవ్యం ఖరారు కానుంది. ఈ దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి:
56 degrees : నాగపూర్‌లో 56 డిగ్రీలు
BOI : బీఓఐ 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం
For Latest News and National News click here
Updated Date - Jun 01 , 2024 | 12:05 PM