PM Kisan Yojana: రైతులు ఈ తప్పు అస్సలు చేయద్దు.. డబ్బులు రావు..
ABN, Publish Date - Dec 04 , 2024 | 06:19 PM
PM Kisan 19th Installment 2024: భారత ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా..
PM Kisan 19th Installment 2024: భారత ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది రైతులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద.. కేంద్రం నుంచి డబ్బులు అందుకుంటున్నారు. ఏడాదికి మూడు వాయిదాలు చొప్పున మొత్తం రూ. 6 వేలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటికే 18 వాయిదాలుగా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 19వ విడత నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. మరి ఈ విడత ప్రయోజనం పొందాలంటే రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏమైనా పొరపాట్లు చేస్తే మాత్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులు పొందలేరు.
అర్హులేనా..
ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే.. ముందుగా ఆ పథకానికి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఈ స్కీమ్‌కు మీరు అర్హులని భావిస్తే.. అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. ముందుగా మీరు రైతు అయి ఉండాలి. దాంతో పాటు బీపీఎల్ పరిధిలోకి రావాలి.
ఈ తప్పులు చేస్తే డబ్బులు రావు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 18 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. 19వ విడత డబ్బులు కూడా త్వరలో రానున్నాయి. ఈ డబ్బులు పడాలంటే రైతులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా ఆ తప్పుల చేసినట్లయితే.. పథకం డబ్బులు అందుకోలేరు. మరి రైతులు ఎలాంటి పొరపాట్లు చేయొద్దో ఇప్పుడు తెలుసకుందాం..
ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
1. ల్యాండ్ వేరిఫికేషన్ పనిని అసంపూర్తిగా వదిలేయొద్దు. ల్యాండ్ వేరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలి. ఒక వేళ రైతులు ల్యాండ్ వేరిఫికేషన్ చేయించకపోతే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం పొందలేరు. మీకు ఈ పథకం డబ్బులు అందాలంటే.. తప్పనిసరిగా ల్యాండ్ వేరిఫికేషన్ చేయించాలి.
2. చాలా మంది రైతులు ఈ-కేవైసీ చేయించరు. ఈ-కేవైసీ చేయించకున్నా డబ్బులు వస్తాయని భావిస్తారు. కానీ, అది పెద్ద మిస్టేక్ అవుతుంది. ఈ స్కీమ్‌కు అప్లై చేసుకున్న రైతులందరూ ఈ-కేవైసీని తప్పనిసరిగా చేయించాలి. లేదంటే ఈ పథకం ప్రయోజనం పొందలేరు. అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా రైతులు ఈ-కేవైసీని పొందవచ్చు. సీఎస్‌సీ కేంద్రానికి కూడా వెళ్లి ఈ పనిని పూర్తి చేయొచ్చు. ఈ-కేవైసీ చేస్తేనే పథకం కింద డబ్బులు పొందుతారు.
3. అప్లికేషన్‌లో పొరపాట్ల కారణంగా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందలేని పరిస్థితి ఉంటుంది. అందుకే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపాలి. అప్లికేషన్ ఫారమ్‌లో పేరు తప్పుగా ఉండటం, ఆధార్ నెంబర్ తప్పుగా ఉండటం, స్పెల్లింగ్ మిస్టేక్స్ కారణంగా.. మీ అప్లికేషన్ రద్దవుతుంది. అందుకే.. అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
4. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పొందాలంటే.. రైతులు తప్పనిసరిగా ఆధార్ లింకింగ్ చేయించాలి. బ్యాంక్ ఖాతాకు, ఆధార్‌ను అనుసంధానం చేయాలి. ఒకవేళ ఆధార్ లింక్ చేయనట్లయితే.. వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఆధార్ కార్డును లింక్ చేయాలి. లేదంటే.. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందలేరు.
Also Read:
ఫడ్నవిస్-షిండే మధ్య వెల్లివిరిసిన మైత్రీబంధం, ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ డిమాండ్లకు అర్థమే లేదు.. పీసీబీకి భారత్ షాక్
జగన్ చేసినట్టు బాబు ఎందుకు చేయరు..
For More National News and Telugu News..
Updated Date - Dec 04 , 2024 | 06:19 PM