PM Modi: ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - May 19 , 2024 | 03:28 PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లోని(Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
రాంచీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లోని(Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మావోయిస్ట్ భాష ఉపయోగించడం వల్ల ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారన్నారు.
ఆ పార్టీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, లోక్‌సభ స్థానాలను పూర్వీకుల ఆస్తులుగా పరిగణిస్తోందని ఆరోపించారు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనే రాహుల్ గాంధీ నిర్ణయంపై మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ 'షెహజాదా'(ప్రిన్స్ లేదా రాజకొడుకు) రాయ్‌బరేలీకి నియోజకవర్గానికి వెళ్లి ఇది తన అమ్మ పోటీ చేసే స్థానమని, తాను పోటీ చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కాంగ్రెస్, జేఎంఎం తీసేయాలని చూస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. "కాంగ్రెస్, జేఎంఎంలకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదు. వారి పని అబద్ధాలాడటం, బిగ్గరగా మాట్లాడటం, పేద ప్రజల సంపద దోచుకోవడం. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్. ఆ పార్టీ బొగ్గు, 2 జీ స్కామ్‌లతో దేశాన్ని దోచేసింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమికి తగిన బుద్ధి చెప్పాలి" అని మోదీ ఓటర్లను కోరారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 19 , 2024 | 03:28 PM