Narendra Modi: 2 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Jul 11 , 2024 | 10:20 AM
రష్యా, ఆస్ట్రియా దేశాల అధికారిక పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ సోమవారం రష్యా, ఆస్ట్రియాలకు వెళ్లారు. పర్యటనలో మొదటి విడతలో ప్రధాని మాస్కోకు వెళ్లగా, రెండో చివరి దశలో వియన్నా వెళ్లారు.
రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) ఈరోజు ఉదయం న్యూఢిల్లీ(delhi) చేరుకున్నారు. బుధవారం ఆస్ట్రియా నుంచి బయలుదేరగా, నేడు న్యూఢిల్లీ చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల అత్యున్నత నేతలతో మాట్లాడి ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి 22వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మోదీ ఆస్ట్రియా నుంచి బయలుదేరిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీకి బయలుదేరారని తెలిపింది.
ప్రధాని మోదీని పుతిన్(putin) మంగళవారం అధికారికంగా 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అపోస్టల్' అవార్డుతో సత్కరించారు. ఇది రష్యా అత్యున్నత గౌరవం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మోదీ చేసిన కృషికి గాను మోదీకి ఈ గౌరవం లభించింది. భారతదేశం, రష్యా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయి.
ఆస్ట్రియాలోనూ ఘన స్వాగతం
రష్యా తర్వాత ప్రధాని మోదీ ఆస్ట్రియాలో పర్యటించారు. అక్కడ కూడా ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారతదేశం, ఆస్ట్రియా(austria) మధ్య 75 ఏళ్ల సంబంధాల చరిత్రలో, గత 40 సంవత్సరాలలో మొదటిసారిగా ఒక ప్రధానమంత్రి ఆస్ట్రియాను సందర్శించారు. ప్రధాని మోదీ 'X' పోస్ట్‌లో, "నా ఆస్ట్రియా పర్యటన చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. మన దేశాల మధ్య స్నేహంలో కొత్త శక్తి వచ్చింది. వియన్నాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆ క్రమంలో ఇరు దేశాల్లోని భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి:
Viral Video: సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి
Narendra Modi: బుద్ధుడిని ఇచ్చింది భారత్, యుద్ధం కాదని గర్వంగా చెప్పగలం
For Latest News and National News click here
Updated Date - Jul 11 , 2024 | 10:23 AM