Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:55 PM
60 మందికిపైగా భక్తులతో ఉన్న బస్సు ఆకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఆ క్రమంలోనే గమనించిన డ్రైవర్ తెలివిగా వ్యవహరించి సకాలంలో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. ఆ తర్వాత ఏమైందనే వివరాలను ఇక్కడ చుద్దాం.
వీకెండ్ వేళ దాదాపు 61 మంది భక్తులు డేరా రాధా స్వామి సికందర్‌పూర్‌కు బస్సులో వెళ్తున్నారు. అదే సమయంలో ఆకస్మాత్తుగా బస్సులో మంటలు (Bus Fire Accident) చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బస్ డ్రైవర్ తెలివిగా వ్యవహరించి సకాలంలో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన హర్యానా(Haryana)లోని ఫతేహాబాద్ పరిధిలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బరోపాల్ చౌకీ పోలీసు బృందం, ఫతేహాబాద్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
నిమిషాల్లోనే బస్సు దగ్ధం..
కానీ ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే దాద్రి ద్వారకా గ్రామానికి చెందిన బస్ డ్రైవర్ అమిత్ చాకచక్యంగా ప్రమాదాన్ని గుర్తించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. హిస్సార్ నుంచి ఈ ప్రైవేట్ బస్సు భక్తులను తీసుకుని సిర్సాలోని సికందర్‌పూర్‌లో డేరా రాధా స్వామి వద్దకు వెళ్తోంది. అందులో దాదాపు 61 మంది భక్తులు ఉన్నారు. ఫతేహాబాద్‌లోని బరోపాల్, ధంగడ్ గ్రామం మధ్య ఉన్న హోటల్ కమల్ కికు సమీపంలో బస్సు చేరుకోగానే బస్సు వెనుక టైరు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో డ్రైవర్ అద్దంలోంచి వెనుక టైరుకు మంటలు అంటుకోవడం చూసి వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులందరినీ కిందకు దిగిపోమని చెప్పాడు. దీంతో అనేక మంది ప్రయాణికులు కిందకు దిగారు. ప్రయాణికులు కిందకు దిగిన కొద్ది సేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.
భక్తుల్లో భయాందోళన
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ తర్వాత వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఆ తర్వాత వారిని మరో బస్సులో సికందర్‌పూర్ డేరాకు పంపించారు. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో రాధా స్వామి డేరా సికందర్‌పూర్‌లో రెండు రోజుల వార్షిక భండారా నిర్వహించబడుతుంది. దీనికి హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ సహా చుట్టుపక్కల అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.
భద్రత విషయంలో
అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. వేగంగా బస్ డ్రైవింగ్ చేయడం వల్ల మంటలు వచ్చాయా లేదా ఎవరైనా సిగరెట్ తాగడం వంటి చర్యల కారణంగా మంటలు చెలరేగాయా అనే విషయం తేలాల్సి ఉంది. గతంలో కూడా ఆకస్మాత్తుగా కార్లు సహా పలు వాహానాల్లో మంటలు వ్యాపించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో దూర ప్రయాణాలు చేసే విషయంలో ప్రైవేటు వాహనాల భద్రత గురించి కూడా ప్రయాణికులు ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 01 , 2024 | 12:57 PM