Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు
ABN, Publish Date - Oct 22 , 2024 | 08:50 PM
ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో (Wayanad Bypolls) కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నామినేషన్ దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 23వ తేదీ బుధవారంనాడు ఆమె నామినేషన్ వేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. మధ్యాహ్నం 11 గంటలకు కల్పెట్ట న్యూ బస్టాండ్ నుంచి రాహుల్, ప్రియాంక కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం12 గంటలకు ప్రియాంక నామినేషన్ వేస్తారు.
Supreme Court: యోగి సర్కార్ 'బుల్డోజర్ యాక్షన్'పై సుప్రీం వార్నింగ్
ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. గత వారంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలను ఈసీ ప్రకటించింది. ఆ వెంటనే వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. నవంబర్ 13న వయనాడ్ లోక్‌సభకు ఎన్నిక జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ప్రియాంక వర్సెస్ నవ్య హరిదాస్
కాగా, వయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా నవ్య హరిదాస్‌ను బీజేపీ పోటీలోకి దింపింది. బీజేపీలో డైనమిక్ నేతగా నవ్య హరిదాస్‌కు పేరుంది. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన ఆమె 2007 బీటెక్ పూర్తి చేశారు. కోజికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నవ్యహరిదాస్ సేవలందించారు.
ఇవి కూడా చదవండి..
Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..
Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 22 , 2024 | 08:50 PM