ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elections: కేకేనే మళ్లీ హీరో.. మహారాష్ట్ర సర్వేలో సత్తా చాటిన తెలుగోడు..

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:10 AM

కేకే సర్వే మరోసారి నిజమైంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే అధికారం అని సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఆ మేరకు కూటమి లీడ్‌లో కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతికి 225 స్థానాలు వస్తాయని కేకే అంచనా వేశారు. ఊహించినట్టే కూటమి అన్ని స్థానాల్లో లీడ్‌లో ఉంది.

Psephologist KK

కేకే ఈ పేరు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కేకే సర్వే తప్పడంతో ఆయన సర్వేలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. గాలి లెక్కలు చెబుతున్నారంటూ కేకేపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. హర్యానాలో కేకే సర్వే తప్పడంతో ఆయన కుంగిపోలేదు. లోపాలను సరిచేసుకుని, మహారాష్ట్రలో సరైన అంచనాలతో ముందుకొస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానాతో పాటు తరువాత జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందని ముందే చెప్పారు. దీంతో మహారాష్ట్రలో కేకే సర్వే ఎలాంటి అంచనాలను ప్రకటిస్తుందోనని అంతా ఎదురుచూశారు. అనూహ్యంగా జాతీయస్థాయిలో ఏ సర్వే సంస్థ ఇవ్వని విధంగా మహారాష్ట్రలో 225 స్థానాల్లో మహాయుతి కూటమి గెలుస్తుందని కేకే ప్రకటించారు. రాసిపెట్టుకోండి తన సర్వే అక్షరాలా సత్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు.


లీడ్‌లో మహాయుతి కూటమి

ఓట్ల లెక్కింపు మొదలుపెట్టినప్పటి నుంచి మహాయుతి కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఉదయం 11 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం మహాయుతి కూటమి 220 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండటంతో మరోసారి కేకే పేరు జాతీయస్థాయిలో మారుమోగుతోంది. మహారాష్ట్ర ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించిన సంస్థల్లో కొన్ని గరిష్టంగా మహాయుతి కూటమికి 180 నుంచి 190 స్థానాలు ఇవ్వగా కేకే మాత్రం 225 స్థానాలు మహాయుతి గెలుస్తుందని విశ్వాసంతో చెప్పారు. మహారాష్ట్ర ఫలితాలు కేకే సర్వేకు దగ్గరగా ఉండటంతో కేకే సర్వేపై మరోసారి చర్చ మొదలైంది. ఏపీ అసెంబ్లీలో ఎగ్జిట్‌పోల్స్‌తో వార్తల్లో నిలిచిన కేకే.. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇచ్చిన అంచనాలు దగ్గరగా ఉండటంతో కేకే సర్వేపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


ఏపీలో ఎగ్జాట్ ఫిగర్..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ సర్వే సంస్థ వెల్లడించని విధంగా కేకే సర్వే 160కి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. అదే సమయంలో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఆ పార్టీ గెలుస్తుందని కేకే తెలిపారు. కేకే అంచనాలకు తగిన విధంగా వాస్తవ ఫలితాలు రావడంతో ఆయన సర్వే తీవ్ర సంచలనమైంది. మహారాష్ట్ర ఫలితాలు చూస్తుంటే కేకే సర్వేకు దగ్గరగా ఉండటంతో జాతీయ స్థాయిలో ఆయన సర్వే మరోసారి సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి:

Election Counting: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికల కౌటింగ్ మొదలు.. ఎవరిది గెలుపు


National Security: బాంబు బెదిరింపుల ఘటనలపై పోలీస్ సదస్సు.. పాల్గొననున్న ప్రధాని, హోంమంత్రి


Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే.


Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు.

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 23 , 2024 | 11:10 AM