Pune Airport: పుణె విమానాశ్రయానికి 'సంత్ తుకారాం మహరాజ్' పేరు
ABN, Publish Date - Sep 23 , 2024 | 06:47 PM
విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ముంబై: పుణె (Pune)లోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్' (Jagadguru Sant Tukaram Maharaj International Airport)గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
Kangana Ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ వార్నింగ్
ఓబీసీ జాబితాలో మూడు కుంబి ఉప-కులాలను చేర్చాలనే మరో కీలక నిర్ణయాన్ని కూడా మంత్రివర్గం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. రూ.1,484 కోట్లతో శిరుర్ నుంచి ఛత్రపతి శంభాజినగర్ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పరిరక్షించే జీఎస్‌టీ యాక్ట్‌కు సవరణలు చేయడం, సకల సదుపాయాలతో స్పోర్ట్ ఫెసిలిటీ ఏర్పాటుకు క్రికెటర్ అజింక్య రహానేకు బాంద్రాలో స్థలం కేటాయించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్టు ఏక్‌నాథ్ షిండే చెప్పారు.
Read More National News and Latest Telugu News
Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు
Updated Date - Sep 23 , 2024 | 06:47 PM