Pune: యువకుడికి స్టేషన్‌లో రాచ మర్యాదలు..!!
ABN, Publish Date - May 21 , 2024 | 07:46 PM
పుణేలో ఓ మైనర్ కారు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ తీసుకెళ్లి రాచ మర్యాదలు అందజేశారని తెలిసింది. మద్యం సేవించి, డ్రగ్స్ కూడా తీసుకున్న యువకుడికి స్టేషన్‌లో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పుణే: పుణేలో (Pune) ఓ మైనర్ కారు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ తీసుకెళ్లి రాచ మర్యాదలు అందజేశారని తెలిసింది. మద్యం సేవించి, డ్రగ్స్ కూడా తీసుకున్న యువకుడికి స్టేషన్‌లో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ యువకుడి స్టేషనల్‌లో గంటల పాటు ఉన్నారు. మైనర్ అయినందున జడ్జీ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చే సమయంలో కొన్ని కండీషన్స్ విధించారు. ఆ యువకుడికి స్టేషన్‌లో పిజ్జా, బర్గర్, బిర్యానీ అందజేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆ యువకుడి వెనక ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్సీపీ నేతలు పోలీస్ స్టేషన్ వెళ్లారని వివరించారు. ఆ మైనర్ బాలుడికి సాయం చేశారని తెలిపారు. స్టేషన్‌లో యువకుడికి పిజ్జా, బర్గర్ అందజేసినందుకు పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరి ప్రాణాలు తీసిన బాలుడికి పుణే పోలీసులు సాయం చేశారు. ఆ వీడియోలో బాలుడు మద్యం తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. సంజయ్ రౌత్ ఆరోపణలపై సీపీ అమితేష్ స్పందించారు. ఆ యువకుడికి సాయం చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని తేల్చి చెప్పారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 21 , 2024 | 07:46 PM