ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:55 AM

సంభాల్ కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందూ-ముస్లిం సమాజాల మధ్య చీలికలు, వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలిగించదన్నారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) సంభాల్‌లో (Sambhal) జరిగిన కాల్పుల ఘటనపై (Shooting incident) కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సంభాల్ కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని అన్నారు. హింస, కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్ని పక్షాల మాట వినకుండా పరిపాలన చేసిన అనుచిత చర్య పరిస్థితిని మరింత దిగజార్చిందని.. చాలా మంది మరణాలకు దారితీసిందని.. దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందూ-ముస్లిం సమాజాల మధ్య చీలికలు, వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలిగించదన్నారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు. శాంతి, పరస్పర సామరస్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మతతత్వం ద్వేషం కాకుండా భారతదేశం ఐక్యత రాజ్యాంగం మార్గంలో ముందుకు సాగేలా మనమందరం కలిసికట్టుగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.


ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా ఆదివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనల్లో ముగ్గురు ఆందోళనకారులు మృతిచెందగా.. 30 మంది పోలీసులు గాయపడ్డారు. షాహీ జామా మసీదు ప్రాంతంలో హరిహర ఆలయం ఉండేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌(జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫు లాయర్‌) స్థానిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 1529లో ఆలయాన్ని కూల్చిన మొఘల్‌ చక్రవర్తి బాబర్‌.. ఇక్కడ షాహీ జామా మసీదును నిర్మించినట్లు కోర్టుకు వెల్లడించారు. మొఘలుల కాలం నాటి పుస్తకాలు-- ‘బాబర్‌ నామా’, ‘ఆయినే-ఇ-అక్బర్‌’ను ఆధారాలుగా చూపించారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జామా మసీదు కమిటీ, సంభాల్‌ జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులగా చేర్చారు. జామా మసీదు కమిటీ 1991 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, చట్టాన్ని ఉటంకిస్తూ.. 1947 నుంచి ప్రార్థన మందిరాలు ఎలా ఉన్నాయో.. అలాగే ఉంచాలనే ఆదేశాలున్నాయంటూ వాదనలను వినిపించింది. వాదోపవాదాలు, పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. మంగళవారం అడ్వొకేట్‌ కమిషనర్‌ సమక్షంలో మసీదు సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. జిల్లా యంత్రాంగం శనివారం నుంచే సర్వేకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 7 గంటల తర్వాత అధికారులు ఆ మసీదు వద్దే సర్వే ప్రారంభించారు.

ఈలోగా సర్వేను నిలిపివేయాలని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పలువురు ఆందోళనకారులు మసీదు వెలుపల గుమికూడారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. ‘‘దుండగులు ఎయిర్‌ పిస్టళ్లతో కాల్పులు జరిపారు. రాళ్లదాడిలోనూ మరికొందరు పోలీసులు గాయపడ్డారు. మొత్తం 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి’’ అని సంభాల్‌ ఎస్పీ కృష్ణకుమార్‌ విష్ణోయ్‌ వెల్లడించారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి, బాష్పవాయు గోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారని చెప్పారు. ఈ ఘటనల్లో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలు సహా.. 10 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనను ఎ్‌సపీ చీఫ్‌ అఖిలేశ్‌ ఖండించారు. సర్వేను ఆయన తప్పుబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోందని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 25 , 2024 | 11:55 AM