Amit shah: ఇది మోదీ సర్కార్.. ఉగ్రవాదాన్ని ఏ శక్తీ పునరుద్ధరించలేదు
ABN, Publish Date - Sep 16 , 2024 | 05:12 PM
జమ్మూకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదం వైపు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఉగ్రవాదంపై మెతక వైఖరి ప్రదర్శిస్తాయని విమర్శించారు.
కిష్త్వార్: జమ్మూకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదం వైపు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. కాంగ్రెస్ (Congress), నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూటమి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఉగ్రవాదంపై మెతక వైఖరి ప్రదర్శించి, ఉగ్రవాదులను, రాళ్లురువ్వే వారిని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్కడ (కేంద్రంలో) ఉన్నంత వరకూ ఇండియా గడ్డపై ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ సాహసించలేరని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం చివరిరోజైన సోమవారంనాడు కిష్త్వార్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు.
Vande Bharat: వందేభారత్ రైలు కాంట్రాక్ట్ 50 శాతం పెరిగిందా? రైల్వే శాఖ ఏమందంటే?
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఎందరో అమరులయ్యారని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో సమూలంగా తుడిచిపెడతామని అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను 2019 ఆగస్టులో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే రద్దు చేసిందని, ఇక ఆ చరిత్ర ముగిసిపోయిందని అన్నారు. కాగా, 90 మంది సభ్యులున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన మూడు విడతలుగా పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
For MoreNational NewsandTelugu News
Also Read:Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి
Also Read:Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ
Updated Date - Sep 16 , 2024 | 05:12 PM