Lok Sabha Elections: ఎన్నికల సభలో రాహుల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
ABN, Publish Date - May 27 , 2024 | 05:13 PM
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు బీహార్‌లో జరిగిన ఎన్నికల సభలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సభా వేదకలోని కొంత భాగం కిందకు కృంగిపోవడంతో ఆయన అడుగులు తడబడ్డాయి. అయితే వెంటనే నిలదొక్కుకోడవంతో భద్రత సిబ్బంది ఊపరి పీల్చుకున్నారు.
పాట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారంనాడు బీహార్ (Bihar)లో జరిగిన ఎన్నికల సభలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సభా వేదకలోని కొంత భాగం కిందకు కృంగిపోవడంతో ఆయన అడుగులు తడబడ్డాయి. అయితే వెంటనే నిలదొక్కుకోవడంతో భద్రత సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలోని పాలిగంజ్‌లో సోమవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది.
Jawaharlal Nehru: నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు: సోనియా, ఖర్గే
రాహుల్ గాంధీని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వేదిక పైకి తీసుకువెళ్తుండగా వేదికలోని ఒక భాగం కిందకు కృంగిపోయింది. దీంతో బ్యాలెన్స్ కోసం రాహుల్ కొద్దిసేపు తడబడ్డారు. వెంటనే ఆ విషయం గ్రహించిన మిసాభారతి ఆయన చేయి పట్టు నిలదొక్కుకునేందుకు సహకరించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని రాహుల్ ఫరవాలేదంటూ వారించడం, ఆ వెంటనే రాహుల్ నవ్వుతూ వేదికపై నుంచి సభికులకు చేయి ఊపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాటలీపుత్ర లోక్‌సభ సీటు నుంచి మిసా భారతి పోటీ చేస్తున్నారు.
Read National News and Latest News here
Updated Date - May 27 , 2024 | 05:25 PM