ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

ABN, Publish Date - Jul 01 , 2024 | 05:40 PM

2014 ఎన్నికల వేళ.. స్విస్ బ్యాంక్‌లోని నల్లధనాన్ని భారత్‌కు తీసుకు వస్తానని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల వేళ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అదే మోదీ ప్రచారం నిర్వహించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే..

Rahul Gandhi hands with SP MP Awadhesh Prasad in Lok Sabha

న్యూఢిల్లీ, జులై 01: 2014 ఎన్నికల వేళ.. స్విస్ బ్యాంక్‌లోని నల్లధనాన్ని భారత్‌కు తీసుకు వస్తానని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల వేళ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అదే మోదీ ప్రచారం నిర్వహించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే.. 2024 ఎన్నికల్లో అయోధ్యలో రామమందిరం నిర్మాణమంటూ ప్రచారం చేపట్టారు. అయితే ముచ్చటగా మూడు సార్లు కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. కానీ ఈ ఎన్నికల వేళ రామమందిరం నిర్మాణాన్ని ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Also Read: Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్


అయితే ఫైజాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో రామమందిరం నిర్మాణం జరుపుకున్న అయోధ్య ఉంది. అయితే ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానంలోని ఓటరు మాత్రం సమాజవాదీ పార్టీకి అనుకూలంగా ఓటు వేశాడు. దీంతో ఆ స్థానంలో బీజేపీ ఓటమి పాలైంది. ఈ విషయాన్ని లోక్‌సభ సాక్షిగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలిలో అధికార బీజేపీకి గుర్తు చేశారు. సోమవారం లోక్‌సభలో ఫైజాబాద్ ఎంపీ, సమాజవాదీ పార్టీ నేత అవధేష్ ప్రసాద్‌కు రాహుల్ గాంధీ షేక్‌హ్యాండ్ ఇచ్చి.. శభాష్ అని మెచ్చుకున్నారు. అంతేకాదు.. రాముడు జన్మించిన భూమి అయోధ్య.. బీజేపీకి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందంటూ ఆయన ఓకింత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read: Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు


దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో సమాజవాదీ పార్టీ 37 స్థానాలను గెలుచుకుంది. ఇక బీజేపీ మాత్రం కేవలం 33 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలల్లో విజయం సాధించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అంతగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. బీజేపీ అగ్రనేతలపై తీవ్ర విమర్శలు చేసిన విషయం విధితమే. అందులోభాగంగా ఇటీవల యూపీ సీఎం యోగి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 05:41 PM

Advertising
Advertising