Rahul Gandhi: కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ నిప్పులు.. కుర్చీని కాపాడుకోవడానికే!
ABN, Publish Date - Jul 23 , 2024 | 03:22 PM
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇది కుర్చీని..
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై (Budget 2024) ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిప్పులు చెరిగారు. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ తన మిత్రపక్షాలను సంతోషపెట్టేలా ఉందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలను పణంగా పెట్టి.. బడ్జెట్‌లో తమ మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. తన స్నేహితులను సంతోషపెట్టడం కోసమే ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారని.. దీని నుంచి AA (అదానీ, అంబానీ) ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా సామాన్య భారతీయుడికి ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పారు. ఇదొక కాపీ పేస్ట్ బడ్జెట్ అని.. కాంగ్రెస్ మేనిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టారని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.
Read Also: అలా చేస్తే కూటమి ప్రభుత్వానికే ఇబ్బంది.. పవన్ హెచ్చరిక
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఈ బడ్జెట్ మీద విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తరహాలోనే.. దీనిని ఓ కాపీ పేస్ట్ బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ మోదీ ప్రభుత్వ కాపీక్యాట్ బడ్జెట్.. కాంగ్రెస్ న్యాయ అజెండాను కూడా సరిగ్గా కాపీ చేయలేకపోయిందని ఖర్గే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కూటమి భాగస్వాములను మోసం చేసేందుకు, ఎన్డీఏ మనుగడ సాగిచేందుకు మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అరకొర డబ్బులు పంచుతోందని ఆరోపించింది. ఇది దేశ ప్రగతికి ఉద్దేశించిన బడ్జెట్ కాదని.. మోదీ ప్రభుత్వాన్ని కాపాడే బడ్జెట్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా ఇదొక కాపీక్యాట్ బడ్జెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలను సెటైరికల్ కామెంట్ చేశారు. అప్రెంటిస్‌షిప్ పథకాన్ని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 11వ పేజీ నుంచి తీసుకున్నారని అన్నారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 23 , 2024 | 03:42 PM