మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: లోక్‌సభ రెండో విడత బరిలో కీలక నేతలు.. ఎవరెవరంటే

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:03 PM

లోక్‌సభ(Lok Sabha Elections 2024) రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగనున్న వేళ.. ఈ విడతలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు బరిలో దిగబోతున్నారు. రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్‌లు వంటి అనేక మంది కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ హ్యాట్రిక్‌ పోటీలో ఉన్నారు. మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది.

Delhi: లోక్‌సభ రెండో విడత బరిలో కీలక నేతలు.. ఎవరెవరంటే

ఢిల్లీ: లోక్‌సభ(Lok Sabha Elections 2024) రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగనున్న వేళ.. ఈ విడతలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు బరిలో దిగబోతున్నారు. రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్‌లు వంటి అనేక మంది కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ హ్యాట్రిక్‌ పోటీలో ఉన్నారు. మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది.

శుక్రవారం రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లలో 3, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.


ఆయన సీపీఐకి చెందిన అన్నీ రాజా, బీజేపీకి చెందిన కే సురేంద్రన్‌తో పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికలలో రాహుల్ సీపీఐకి చెందిన సునీర్‌పై 7 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తిరువనంతపురం సీటును నాలుగోసారి నిలబెట్టుకోవాలని కష్టపడుతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ నుంచి పన్నయన్ రవీంద్రన్‌ అదే సీటు నుంచి పోటీలో ఉన్నారు.

2014 నుంచి మథుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమమాలిని బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత ముఖేష్ ధన్‌గర్‌పై పోటీ చేస్తున్నారు. కోటా నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా కాంగ్రెస్ అభ్యర్థి ప్రహ్లాద్ గుంజాల్‌తో తలపడుతున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్‌పూర్ స్థానం నుంచి మూడోసారి విజయం సాధించాలని చూస్తున్నారు.

బెంగళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలపడనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేష్‌ బఘేల్‌ గత 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న రాజ్‌నంద్‌గావ్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత వీరేంద్ర కుమార్ ఖాటిక్ తికమ్‌గఢ్‌లో బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పంకజ్ అహిర్వార్‌ను రంగంలోకి దిగారు. 2019లో ఖాటిక్ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ అహిర్వార్‌పై 3.48 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.


2014 తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడంతో కేరళలోని అలప్పుజ సీటులో పోటీ కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మక మారింది. 2019 ఎన్నికల్లో కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19-1 తేడాతో ఘన విజయం సాధించింది. వేణుగోపాల్ 1996, 2001, 2006లో వరుసగా మూడుసార్లు అలప్పుజ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. 2009,2014లో అలప్పుజా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

EC: మోదీ, రాహుల్‌కు షాక్.. ఆ విషయంలో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు

2019లో పార్టీ ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఎన్నికల్లో పోటీ చేయలదేదు. త్రిస్సూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన కె మురళీధరన్‌, సీపీఎంకు చెందిన వీఎస్ సునీల్‌ కుమార్‌లపై నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి పోటీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్‌ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న సుకాంత మజుందార్‌ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇలా వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలో రెండో విడత పోరులో తలపడనున్నారు.
Read Latest
National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 04:03 PM

Advertising
Advertising