మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Video: సీఎం కోసం స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ..తర్వాత ఏమైందంటే

ABN, Publish Date - Apr 13 , 2024 | 12:58 PM

రాజకీయాల్లో ప్రతి ఏటా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పార్టీలు మారే వారు ఉంటారు. కొన్ని చోట్ల పొత్తులు ఏర్పడగా, మరికొన్ని చోట్ల విచ్చిన్నం అవుతాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన సత్సంబంధాలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్(congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

 Video: సీఎం కోసం స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ..తర్వాత ఏమైందంటే

రాజకీయాల్లో ప్రతి ఏటా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పార్టీలు మారే వారు ఉంటారు. కొన్ని చోట్ల పొత్తులు ఏర్పడగా, మరికొన్ని చోట్ల విచ్చిన్నం అవుతాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన సత్సంబంధాలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్(congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ శుక్రవారం (ఏప్రిల్ 12) స్టాలిన్‌ కోసం ఏకంగా స్వీట్ షాపునకు వెళ్లి మైసూర్ పాక్ కొనుగోలు చేసి ఆ తర్వాత దానిని తీసుకొచ్చి సీఎంకు బహుమతిగా ఇచ్చారు.


అందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ(congress) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వీడియోలో రాహుల్ ఓ రోడ్డు డివైడర్ దాటి మైసూర్ పాక్ కొనడానికి ఓ షాపుకు వెళ్లారు. అప్పుడు షాపు యజమాని సహా అక్కడున్న సిబ్బంది వెంటనే స్పందించి ఏం కావాలని అడిగారు. దీంతో రాహుల్ మా సోదరుడు స్టాలిన్ కోసం మైసూర్ పాక్ వెరైటీ కావాలని అడిగారు. ఆ క్రమంలో కొన్ని స్వీట్లను రుచి చూసి చివర్లో డబ్బు చెల్లించి స్వీట్లు తీసుకున్నారు. ఆ క్రమంలో షాపులో పనిచేసే మహిళలతో కలిసి రాహుల్ ఓ ఫొటో కూడా దిగారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది.


కాంగ్రెస్ పంచుకున్న రాహుల్ వీడియోపై తమిళనాడు సీఎం స్టాలిన్(MK Stalin) కూడా స్పందించారు. నా సోదరుడు రాహుల్ గాంధీ స్వీట్ కానుకతో పొంగిపోయానని పేర్కొన్నారు. ఈ క్రమంలో జూన్ 4న ఇండియా కూటమి ఖచ్చితంగా ఆయనకు తిపి విజయాన్ని అందించబోతోందని స్టాలిన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు 2024(lok sabha election 2024)లో మొదటి దశ ప్రక్రియలో భాగంగా ఓటింగ్ ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయి. కాంగ్రెస్‌తో విపక్షాల ఇండియా కూటమిలో ప్రస్తుతం డీఎంకే భాగంగా ఉంది. నిన్న కోయంబత్తూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇరువురు నేతలు ప్రసంగించారు.


ఇది కూడా చదవండి:

RJD Manifesto: కోటి ఉద్యోగాలు ఇస్తాం, రక్షా బంధన్‌కు యువతులకు లక్ష .. ఆర్జేడీ మ్యానిఫెస్టోలో ఇంకా..

Sukesh Chandrashekhar: వారందరి బండారం బయటపెడతా.. సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ..


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 01:02 PM

Advertising
Advertising