ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: రెండు చోట్ల పోటీ చేయనున్న రాహుల్ గాంధీ..నిజమేనా?

ABN, Publish Date - Mar 09 , 2024 | 07:43 AM

లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వారి మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని జాబితాలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రాహుల్ అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే చర్చ మొదలైంది.

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) వారి మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించారు. ఇటివల కాంగ్రెస్ తొలి జాబితాలో 39 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా..ఆ జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు కూడా ఉంది. అయితే రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని జాబితాలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రాహుల్ అమేథీ(amethi) నుంచి కూడా పోటీ చేస్తారనే చర్చ మొదలైంది.

ఎందుకంటే శుక్రవారం విడుదల చేసిన కాంగ్రెస్‌ జాబితాలో ఉత్తరప్రదేశ్‌(uttar pradesh)‌ నుంచి ఏ అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేదు. మరోవైపు ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా కాంగ్రెస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రాహుల్ గాంధీ రెండు చోట్ల మళ్లీ పోటీ చేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే రాహుల్ వాయనాడ్‌తో పాటు అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ(two places) చేయవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నిజానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో అమేథీ(amethi)లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలయ్యారు.


మరోవైపు రాహుల్ గాంధీకి కేరళలోని వాయనాడ్(wayanad) సేఫ్ సీట్ అని మరికొంత మంది రాజకీయ నేతలు అంటున్నారు. ఇలాంటి క్రమంలో చివరకు కాంగ్రెస్ నుంచి రాహుల్ రెండు చోట్ల పోటీ చేస్తారా లేదా ఒక స్థానం నుంచే చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అంతేకాదు వచ్చే లోక్‌సభ ఎన్నికలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడమే తమ లక్ష్యమని అంటున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో 12 మంది 50 ఏళ్ల లోపు వారేనని చెప్పారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Congress First List: కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..

Updated Date - Mar 09 , 2024 | 07:43 AM

Advertising
Advertising