ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక కేకులు, ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు..

ABN, Publish Date - May 18 , 2024 | 04:01 PM

రాయబరేలితో తన కుటుంబ సభ్యులకు, తనకు ఉన్న అనుబంధాన్ని, తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తన సోదరి ప్రియాంక గాంధీకి, తనకు మధ్య జరిగిన సంభాషణల వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు.

న్యూఢిల్లీ: రాయబరేలి (Rayabareli)తో తన కుటుంబ సభ్యులకు, తనకు ఉన్న అనుబంధాన్ని, తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తన సోదరి ప్రియాంక గాంధీకి, తనకు మధ్య జరిగిన సంభాషణల వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు.


దేశం సాధించిన పురోగతిలో రాయబరేలిది కీలక పాత్ర అని, ఒకప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో ఈ ప్రాంతం దిశానిర్దేశం చేసిందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కూడా కేంద్రంగా ఉండేదని రాహుల్ ఈ వీడియోలో పేర్కొన్నారు. రాయబరేలి నుంచి మరోసారి దేశానికి పురోగతి, అభివృద్ధి పథాన్ని చూపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.


రాజకీయాలు, కుటుంబ సంబంధాలపై బీజేపీ నేతలపై పరోక్షంగా రాహుల్ విసుర్లు విసిరారు. తన కుటుంబ సభ్యులను తాను గౌరవిస్తానని, అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తుంటానని, తమ మధ్య రాజకీయాలకు తావుతుండదని చెప్పారు. ''మీరు కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వకపోతే బయట సత్సంబంధాలు కొనసాగించలేరు. నిత్య జీవితంలో మీరు అబద్ధాలు చెబుతూ పోతుంటే రాజకీయాల్లోనూ అబద్ధాలు అలవాటుగా మారుతాయి'' అని రాహుల్ అన్నారు.

Deve Gowda: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో బాంబు పేల్చిన దేవెగౌడ


రాయబరేలి వెళ్లనప్పుడు తాను, ప్రియాంక అక్కడ గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటామని, నానమ్మ జ్ఞాపకాలు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక తయారు చేసిన కేకులు, ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు మా కళ్ల ముందు మెదులుతుంటాయని రాహుల్ చెప్పారు. ఇవన్నీ నిన్నే జరిగినట్టు అనిపిస్తుంటుందన్నారు. తమకు చిన్నప్పటి నుంచి రాజకీయాలతో ప్రగాఢమైన అనుబంధం ఉందని, అయితే తమ మధ్య ఎప్పుడూ రాజకీయాలకు తావులేదని ఆ వీడియోలో తెలిపారు.


ఓటే ఆయుధం: ప్రియాంక

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, ప్రగతి, అభివృద్ధి లక్ష్యంగా ఓటనే బలమైన ఆయుధాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ''ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో దృష్టిని మళ్లించకండి. అర్జునుడు లక్ష్య సాధన కోసం ఏ విధంగా చేపకంటికి గురిపెట్టాడో, ప్రజలు కూడా అభివృద్ధి అనే లక్ష్యంపై దృష్టి సారించాలి. ఓటనే బలమైన ఆయుధం మీ చేతుల్లో ఉంది. దానిని సమర్ధవంతంగా ఉపయోగించుకోండి, మీ భవిష్యత్తులో మార్పును ఆహ్వానించండి'' ప్రియాంక పిలుపునిచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 04:01 PM

Advertising
Advertising