ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: రాహుల్‌ 4-5 చోట్ల పోటీ చేస్తే మంచిది.. కేంద్ర మంత్రి సలహా

ABN, Publish Date - Apr 27 , 2024 | 06:52 PM

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యనాడ్ నియోజకవర్గంతో పాటు అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే ఉహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయెల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ 4-5 చోట్ల పోటీ చేయవచ్చని అన్నారు. వయనాడ్‌, అమేథిలో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

ముంబై: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వయనాడ్ (Wayanad) నియోజకవర్గంతో పాటు అమేథీ (Amethi) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే ఉహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయెల్ (Piyush Goyal) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ 4-5 చోట్ల పోటీ చేయవచ్చని అన్నారు. వయనాడ్‌, అమేథిలో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

Lok Sabha Elections 2024: అమ్మేది ఈ ఇద్దరు...కొనేది ఆ ఇద్దరు


''ముంబై నార్త్ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్‌ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన పోటీ చేయాలనుకుంటే అమేథి నుంచి పోటీ చేయవచ్చు. తగినంత ధైర్యం ఉంటే వారణాసి (మోదీ నియోజకవర్గం) నుంచి కూడా పోటీ చేయవచ్చు. వయనాడ్‌లో ఆయన ఓడిపోతారు. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి తప్పదు. ఒక వేళ అయోధ్య వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. కానీ అది వేరే విషయం. వాళ్లు శ్రీరాముడిని వ్యతిరేకించారు. రామసేతు ధ్వంసం చేసే ఆలోచన చేశారు. ఆయన (రాహుల్) అక్కడకు (అయోధ్యకు) వెళ్లి తమ పార్టీ నేతలు, కూటమి భాగస్వామి నేతలు ఏదైతే చెప్పారో దానికి క్షమాపణ కోరాల్సి ఉంటుంది'' అని పీయూష్ గోయెల్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమోథీ, రాయబరేలి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆ రెండు నియోజకవర్గాల నేతలతో కాంగ్రెస్ కీలక సమావేశం శనివారం ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో పీయూష్ గోయెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వయనాడ్‌లో ఇప్పటికే రాహుల్ పోటీలో ఉండగా, అమేథీ నుంచి కూడా మూడోసారి బరిలోకి దిగనున్నారని, రాయబరేలి నుంచి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 06:52 PM

Advertising
Advertising