ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: రాయబరేలి హనుమాన్ ఆలయంలో రాహుల్ పూజలు

ABN, Publish Date - Jul 09 , 2024 | 02:50 PM

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయబరేలిలో మంగళవారంనాడు పర్యటించారు. బచ్రావాన్‌లోని చురువా హనుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

రాయబరేలి: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన సొంత నియోజకవర్గమైన రాయబరేలి (Rae Bareli)లో మంగళవారంనాడు పర్యటించారు. బచ్రావాన్‌లోని చురువా హనుమాన్ (Churuwa Hanuman) ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచినందుకు ఆయన తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతారని, పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమవుతారని కాంగ్రెస్ జిల్లా విభాగం అధ్యక్షుడు పంకజ్ తివారీ తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా నియమితులైన తర్వాత రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గానికి రావడం ఇదే మొదటిసారి.

PM Modi: భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోంది: మోదీ


కాగా, ఇటీవల ముగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలి నుంచి 3.90 లక్షల ఓట్ల ఆధిక్యంతో రాహుల్ గెలిచారు. కేరళలోని వయనాడ్ నుంచి కూడా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఆ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దించనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 సీట్లు గెలుచుకోగా, వయనాడ్‌కు రాహుల్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 98కి తగ్గింది.

For Latest News and National News click here

Updated Date - Jul 09 , 2024 | 02:50 PM

Advertising
Advertising
<